ఈ రోజుల్లో డేటింగ్ ట్రెండ్ (dating Trend )వేగంగా పెరుగుతోంది. వ్యక్తులు ఆన్లైన్ డేటింగ్ సైట్ (dating site)లలో కలుసుకుంటారు. వారి గురించి ఒకరికొకరు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. చాలా మంది చెప్పిందంతా నమ్మేసి ఎక్కువగా తెలియకుండానే వారిని కలవడానికి అంగీకరిస్తారు (అపరిచితులతో డేటింగ్). అటువంటి పరిస్థితిలో చాలా మంది మోసపోతుంటారు కూడా. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగిందవి అమెరికాలో (America).
కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత..
అమెరికా (America)లోని నాష్‌విల్లేలో నివసిస్తున్న షైనా కే కార్డ్వెల్ (Shina Kay Cordwell) ఓ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమె తన వింత డేటింగ్ (dating) అనుభవాన్ని పంచుకుంది. హింజ్ అనే డేటింగ్ యాప్ (dating App)లో ఒక వ్యక్తిని కలిశానని షైనా చెప్పింది. కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత మొదటిసారి డేటింగ్‌కు వెళ్లాలని భావించింది. ఈ రోజుల్లో వ్యక్తులు డేటింగ్ ప్రారంభించే ముందు వారి భాగస్వాముల (partners) గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా సైట్ (social media site)లలో స్టాక్ చేస్తారు. సరిగ్గా అదే పని చేసింది ఆ మహిళ. తనను కలుసుకోబోయే వ్యక్తి పేరును గూగుల్ (Google search)లో సెర్చ్ చేసిన తర్వాత ఆ మహిళకు దిమ్మతిరిగిపోయిందట. ఆ వ్యక్తి గురించి ఏం తెలిసిందో తెలుసా..
కిడ్నాప్ కేసులో అరెస్ట్..
డేట్ (date)కి వెళ్లే ముందు, ఆమె తన భాగస్వామి గురించి సోషల్ మీడియా సైట్లో కాకుండా సెర్చ్ ఇంజన్ గూగుల్ (google)లో నేరుగా సెర్చ్ చేసింది. దీంతో ఆమెకు అతని గురించి నమ్మలేని నిజాలు తెలిసిపోయాయి. ది సన్ వెబ్సైట్ నివేదిక ప్రకారం సదరు మహిళ టిక్‌టాక్ (Tiktok)లో ఈ విషయంపై ఓ వీడియోను పంచుకుంది . గూగుల్‌లో ఆ వ్యక్తి పేరును టైప్ చేసినప్పుడు, కిడ్నాప్ కేసు (Kidnap case)లో ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిసిందట. దీంతో షాక్ అవడం ఆమె వంతైందని తెలిపింది.
సోషల్ మీడియాలో మొత్తం నిజం తెలియదని..
దీంతో ఆమె వీడియోలో సోషల్ మీడియా (Social media)ను వాడే వారికి కొన్ని సూచనలు చేసింది. తెలియని వ్యక్తితో డేటింగ్‌కు వెళ్లినప్పుడు, ముందు ఆ వ్యక్తుల గురించి సోషల్ మీడియాతో పాటు గూగుల్‌లో తనిఖీ చేయాలని సూచించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో మొత్తం నిజం తెలియదని వివరించింది. మహిళ వీడియో (Video)పై కామెంట్ చేస్తూ చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. డేటింగ్ సైట్ల (dating sites) ద్వారా వ్యక్తులతో డేటింగ్ చేయకపోవడానికి ఇదే కారణమని ఓ మహిళ చెప్పింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
ఇది కూడా చదవండి: సొరంగంలో నుంచి బయటకొచ్చిన 17 మంది అమ్మాయిలు.. పోలీసులు షాక్.. ఇంతకీ ఏంటీ కథ.. ఎక్కడ జరిగింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Dating App, Trending news