spirit marriage: ఆత్మ వచ్చి తనను పెళ్లి చేసుకుందని చెప్పిన మహిళ.. ఆ ఆత్మ ఎవరిదో తెలిస్తే.. షాక్​ అవ్వాల్సిందే

మైఖేల్ జాక్సన్, కథ్లీన్

ఓ ఆత్మ వచ్చి తనను పెళ్లాడిందని మీడియాకు చెప్పేసింది క్యాథలీన్ రాబర్ట్స్. అయితే ఏదో ఒక ఆత్మలే అనుకుంటే.. అందరూ లైట్​ తీసుకునే వారే. కానీ, క్యాథలీన్​ ఇక్కడ చెప్పిన ఆత్మ మరెవరిదో కాదు.. ఏకంగా పాప్ కింగ్ మైఖేల్ జాక్స న్ఆత్మ అంట. మైఖేల్​ను తాను పెళ్లాడనని .. అతని ఆత్మ తనతో రిలేషన్​లో ఉందని సంచలన కహాని చెప్పింది.

 • Share this:
  క్యాథలీన్ రాబర్ట్స్(Kathleen Roberts).. ఒక అమెరికన్ మహిళ... ఆమె పూర్వ జన్మలో మార్లిన్ మన్రో(Marilyn Monroe) అని చెప్పి అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది.  కేవలం పబ్లిసిటీ కోసమే అలా చెబుతోందని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా? ఇటీవల ఈమె చెప్పిన విషయం మాత్రం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది .  ఏకంగా ఓ ఆత్మ(spirit) వచ్చి తనను పెళ్లాడిందని(married) మీడియాకు చెప్పేసింది. అయితే ఏదో ఒక ఆత్మలే అనుకుంటే.. అందరూ లైట్​ తీసుకునే వారే. కానీ, క్యాథలీన్​ ఇక్కడ చెప్పిన ఆత్మ మరెవరో కాదట ఏకంగా పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్(Michael Jackson) ఆత్మ(ghost) అంట. మైఖేల్​ను తాను పెళ్లాడానని .. అతని ఆత్మ(spirit) తనతో రిలేషన్లో ఉందని సంచలన కహాని చెప్పింది. అంతేనా జాక్సన్​ ఆత్మ ఆమెతో కలిసి డ్యాన్స్(dance) చేయడం ఇంకా పాటలు పాడటం అలాగే తినడం వంటివి చేస్తుంటుందని క్యాథలీన్​ చెప్పేయడం మరో వింత.​ ఇంకా చాలా విషయాలే చెప్పింది ఆ క్యాథలీన్​... అవేంటంటే..

  క్యాథలీన్​కు మైఖేల్ జాక్సన్ ఆత్మ(spirit)  చాలా స్పష్టంగానే ప్రపోజ్ చేసిందట. గులాబీ కలర్ నిశ్చితార్థపు ఉంగరం(pink engagement ring)తో మైఖెల్ జాక్సన్ అమెకు ప్రపోజ్​ చేశాడట. అంతేనా వీళ్లిద్దరికి పెళ్లి(marriage) కూడా అయిందని చెప్పేసింది సదరు క్యాథలిన్​ గారు. అలాగే రేవెరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్(Rev. Martin Luther King Jr) తామిద్దరికీ పెళ్లి కూడా జరిపించాడని ఆమె ఏకంగా న్యూయార్క్ పోస్ట్(newyork post) మీడియాకే చెప్పింది. ఈమె చేస్తున్న ఈ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. గత సంవత్సరం కూడా ఓ ఆర్టికల్లో క్యాథలిన్​ పలు నమ్మరాని విషయాలు చెప్పిందటండోయ్​.. తన జీవితంలో ఎదురవుతున్న పారానార్మల్ యాక్టివిటీ గురించి అందరితో పెంచుకోవాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. గత జన్మలో తను మార్లిన్ మన్రో అని చెప్పుకొచ్చింది.

  పాప్​ సామ్రాజ్యాన్ని ఏలిన మైఖేల్​ జాక్సన్ ​(Michael Jackson) 2009లో మరణించాడు. అయితే అతని పాపులారిటీని చాలా మంది వాడుకొని ఏదో ఒక స్టోరీతో వైరల్​ అవుదామని అనుకుంటున్నారు. గతంలోనూ ఇలాటి సంఘటనే ఒకటి వైరల్​ అయింది. జింబాంబ్వే దేశ రాజధాని హరారే నగరంలోని సెయింట్ మేరీ మిషన్ స్కూల్ లో సాయంత్ర సమయంలో 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కొంత మంది విద్యార్థులు నన్ లతో కలిసి నాటకం ప్రదర్శిస్తుండగా హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయంట. ఆ తర్వాత తెల్లటి గ్లౌజులతో ఓ ఆకారం కనిపించి అందరి వైపు చూసి మందహాసం చేసిందట. ఈ పరిణామంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయారంట. మైఖేల్ జాక్సన్ కనిపించాడు అని ఆనందాశ్చర్యాలలో వుండిపోయారంట.
  Published by:Prabhakar Vaddi
  First published: