Snake band: తలకు పాము చుట్టుకుని షాపింగ్​కి వచ్చిన మహిళ.. కస్టమర్లంతా ఆ పామును చూసి..

హెయిర్​బ్యాండులా పామును చుట్టుకున్న మహిళ (ఫొటో: ఇన్​స్టాగ్రామ్​)

మహిళ గారికి ఫ్యాషన్​ అంటే పిచ్చి ఏమో... కొత్త కొత్త హెయిర్​ బ్యాండ్లు (Hair bands) ట్రై చేస్తోంది. అందులో తప్పేముంది అంటారా? తప్పేం లేదు గానీ.. హెయిర్​బ్యాండు(hair band)ను చూసి అందరు పరుగు లంకించుకున్నారు.

  • Share this:
    నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో.. నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో అని ఓతెలుగు  సినిమాలో పాట ఉంటుంది.. అలాగే ఓ మహిళ(women) కూడా నలుగురిలా కాకుండా కొంచెం కొత్తగా (తేడాగా) మసులుకుంటోంది. సదరు మహిళ గారికి ఫ్యాషన్​ అంటే పిచ్చి ఏమో... కొత్త కొత్త హెయిర్​ బ్యాండ్లు (Hair bands) ట్రై చేస్తోంది. అందులో తప్పేముంది అంటారా? తప్పేం లేదు గానీ.. హెయిర్​బ్యాండు(hair band)ను చూసి అందరు పరుగు లంకించుకున్నారు మరి.. హెయిర్​ బ్యాండును చూసి పరిగెత్తడం ఏంటీ అనుకుంటున్నారా? అవును ఆమెకు దూరంగా.. భయపడుతూ వెళ్లిపోయారు. ఇంతకీ ఆ హెయిర్​ బ్యాండు ఏ రకం అంటారా? పాము రకం. ఏదో బొమ్మ పాము కాదండోయ్​.. నిజంగానే పాము(snake)ను తలకు చుట్టుకుని రోడ్లపైకి వచ్చేసింది. అంతే.. చూసిన భయస్తులు పరుగు లంకించుకోగా.. మరికొందరు ఉత్సాహంగా ఫొటోలు వీడియోలు(video) తీశారు. ఆ వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది. మనమూ ఓ లుక్కేద్దాం పదండి..








    View this post on Instagram






    A post shared by Snakes Mania (@snakes.mania)






    ఓ మహిళ షాపింగ్‌(shopping) చేయడానికి మాల్‌కు వెళ్లింది. ఆ సమయంలో మాల్‌(mall)లో ఉన్న వారంతా ఆమె తల(head)పై ఆసక్తిగా చూడటం గమనించారు. దీనికి కారణం ఆమె జుట్టుకు విచిత్రమైన ఓ హెయిర్‌ బ్యాండ్‌ ఉండటమే. మొదట్లో అందరూ అది ఒక రకమైన హెయిర్‌ బ్యాండ్‌ అనుకున్నారు. కానీ అది కదులుతుండటంతో అదొక పాము(snake) అని గుర్తించారు. కొందరేమో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి సదరు మహిళ తలపై పెట్టుకున్న పామును వీడియో తీసి సోషల్‌ మీడియా(social media)లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు ఇదేం పాడు ఆలోచన అని అంటుంటే మరికొందరు మాత్రం చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మరి ఈ పాము హెయిర్‌ బ్యాండ్‌ ఎలా ఉందో మీరూ ఈ వీడియోలో చూసేయండి.

    ఇలాంటి వింత వ్యక్తులు ఇటీవల ప్రపంచానికి ఎక్కువగా పరిచయమవుతున్నారు. దీనికి కారణం సోషల్‌ మీడియా విస్తృతి పెరగడమే. అందరికీ స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా ఇట్టే సమాచారం అరచేతిలోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా వైరల్‌ వీడియాలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. దానికి నెటిజన్ల నంచి కూడా మంచి స్పందన రావడంతో చాల మంది ఇలాగే కొత్త కొత్త వింతైన పనులు చేస్తున్నారు. అయితే ఈ మహిళలను కొంత మంది వెనకేసుకొస్తున్నారు. ఆ సర్పం ఆమె పెంచుకున్నది కావచ్చని. ఆమె పెట్​ను ఆమె పెట్టుకుందని కౌంటర్​ ఇస్తున్నారు. అయితే జంతువులను పెంచుకోవడం విదేశాల్లో మామూలే. కానీ, ఇలా విష సర్పాలు పెంచుకుంటేనే సమస్య.
    Published by:Prabhakar Vaddi
    First published: