హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Starlink Satellites: ఆకాశంలో అద్భుతం.. భూమి నుంచే కనువిందు.. కర్ణాటకలో ఏం జరిగిదంటే..

Starlink Satellites: ఆకాశంలో అద్భుతం.. భూమి నుంచే కనువిందు.. కర్ణాటకలో ఏం జరిగిదంటే..

Photo Credit : Nihal Amin

Photo Credit : Nihal Amin

Viral Video: కర్ణాటకలో అసలు ఏం జరిగింది..? ఆకాశంలో ఆ మిరుమిట్లు గొలిపే కాంతులు ఏంటి..? ఏలియన్స్ పనా..? లేకపోతే మనుషులా పనా..?

కర్ణాటక (Karnataka) లో అద్భుతం జరిగింది. ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ, వరుసగా వెళ్తున్న శాటిలైట్స్ భూమి నుంచి కనువిందు చేశాయి. ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండానే, నక్షత్రాలు ప్రయాణిస్తున్నట్లు కనువిందు చేశాయి 50కి పైగా శాటిలైట్లు. వీటిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌(Elon Musk)కు చెందిన స్పేస్ ఎక్స్ (Space X) సంస్థ ప్రయోగించింది. ‘స్టార్ లింక్’ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల వీటిని అమెరికా నుంచి లాంచ్ చేశారు. ఇవి భూ కక్ష్యలో తిరుగుతుండగా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుంచి కనిపించాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆకాశంలో వరుసగా వెళ్తున్న శాటిలైట్లను కెమెరాలో బంధించి, యూట్యూబ్‌లో పెట్టాడు ఒక యువకుడు.

ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్ ద్వారా, తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇందుకు మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ‘స్టార్‌లింక్ శాటిలైట్స్ మిషన్’ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు మోహరించి, వాటి ద్వారా ప్రపంచ నలుమూలలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఇందులో భాగంగా ఉపగ్రహాల సమూహాన్ని సృష్టించాలనే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాలను లాంచ్ చేస్తోంది. దశల వారీగా పదుల సంఖ్యలో వీటిని నింగిలోకి ప్రయోగిస్తోంది. ఇలా ఇటీవల స్పేస్‌ ఎక్స్ ప్రయోగించిన లేటెస్ట్ బ్యాచ్ శాటిలైట్స్‌ను కర్ణాటకలోని ఉడిపికి చెందిన నిహాల్ అమీన్ అనే 26 ఏళ్ల వ్యక్తి వీడియో తీశారు.

మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అమీన్‌కు ఆస్ట్రో ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఆసక్తి. తాజాగా ఆకాశంలో కనువిందు చేసిన స్టార్‌లింక్ శాటిలైట్స్‌ను ఆయన క్యాప్చర్ చేశారు. మిరుమిట్లుగొలుపుతూ, నక్షత్రాల మాదిరిగా మెరుస్తూ.. వరుసగా కక్ష్యలో పయనిస్తున్న ఉపగ్రహాలను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు.

' isDesktop="true" id="1133202" youtubeid="MH4-77fKrIM" category="national">

డిసెంబరు 20న రాత్రి 7:15 గంటలకు అమీన్ ఈ వీడియో తీశారు. ఉడిపిలోని పదుకెరె బీచ్‌లో ఈ శాటిలైట్స్‌ను వీడియోలో క్యాప్చర్ చేశారు. శివమొగ్గ, బాగలకోటె, ఉత్తర కన్నడ జిల్లాల నుంచి కూడా ఇవి కనిపించాయి. ఈ వీడియోలో శాటిలైట్స్ అన్నీ ఒకే వరుసలో కదులుతున్నట్లు కనిపిస్తోంది.

ఒక పొడవాటి కర్రకు మెరిసే లైట్లు కట్టినట్టుగా కనువిందు చేస్తోంది. ఈ శాటిలైట్స్ 340-1150 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంటాయని నివేదికలు వెల్లడించారు. సెకనుకు సుమారు 7.70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, ప్రతి 91 నిమిషాలకు కక్ష్యను పూర్తి చేస్తాయని పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి :  డిసెంబర్ 21.. ఏడాదిలో సుదీర్ఘమైన రాత్రి.. ఎందుకో, దీని ప్రాధాన్యం తెలుసా?

IIM అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన అమీన్.. 2014 నుంచి ఆస్ట్రో ఫోటోగ్రఫీ కోసమని నింగిలో చోటుచేసుకునే అద్భుతాలను కెమెరాలో బంధిస్తున్నాడు. అతని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇలాంటి ఎన్నో ఫోటోలు, వీడియోలు ఉన్నాయి.

మరోవైపు, స్టార్‌లింక్ ఇండియా విభాగాన్ని ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2022 డిసెంబర్ నాటికి భారతదేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు శాటిలైట్ ఇంటర్నెట్‌ను చేరువ చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

First published:

Tags: Elon Musk, Karnataka, Trending videos, Viral Video

ఉత్తమ కథలు