Fine on Actress: ఆదాయపు పన్ను ఎగ్గొట్టిందని టీవీ నటికి రూ. 340 కోట్ల జరిమానా.. చెల్లించే వరకు ఆమె టీవీ షోల ప్రసారం బంద్​

జెంగ్‌‌‌‌ షువాంగ్‌‌‌‌ (ఫైల్​)

పన్ను కట్టని వారిపై చైనా నిషేధం విధిస్తోంది. తాజాగా ఓ టాప్​ సెలెబ్రెటీ పన్ను ఎగ్గొట్టిన్నందుకు రూ.330 కోట్లు కట్టాలని సమన్లు జారీ చేసింది. పన్ను చెల్లించే వరకు తన నటించిన షోలు, డ్రామాలు, సీరీస్​లు ఏవీ ప్రదర్శించకుండా నిషేధం విధించింది

  • Share this:
    ఏ దేశంలోనైనా పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ ఆదాయపు పన్ను(Income tax) చెల్లించాల్సిందే. దీనికెవరూ అతీతులు కాదు. అందులోనూ ఆయా దేశాలకు ఖజానా నిండటానికి ఈ పన్ను(taxes)లే ఆధారం. అందుకే ఆదాయపు పన్నును ఏ దేశమైనా ముక్కుపిండి వసూలు చేస్తాయి.  పన్ను విధానాలు దేశ, దేశానికి భిన్నంగా ఉండవచ్చు, అయితే, పన్ను వసూలు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేక ప్రభుత్వ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడం. ఈ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాటు పన్ను విధించే వ్యవస్థ ఉంది. ఇండియాలోనూ పన్ను విధానం ఉంది. చాలా వరకు పన్నులకు జీఎస్టీ రూపంలో వసూలుచేస్తోంది. అలాగే చైనా(china) కూడా పన్నులు వసూలు చేస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి చైనా అభివృద్ధి బాటలో దూసుకుపోతోంది. ఇదే కోవలో ఆ దేశానికి పన్నులు కూడా బాగానే వస్తున్నాయి. ఇటీవల దేశంలో పేద, ధనికుల మధ్య అంతరాలు తగ్గించాలనే యోచనలో నూతన ఆదాయపు పన్నులు విధించే పద్దతులు(system) తీసుకొచ్చింది. అందులో భాగంగా  సెలెబ్రెటీలపై సైతం ఉక్కుపాదం మోపుతోంది. పన్ను కట్టని వారిపై నిషేధం విధిస్తోంది. తాజాగా ఓ టాప్​ సెలెబ్రెటీ(top celerity) పన్ను ఎగ్గొట్టిన్నందుకు రూ.340 కోట్లు(340 crores) కట్టాలని సమన్లు జారీ చేసింది. పన్ను చెల్లించే వరకు తను నటించిన షోలు, డ్రామాలు, సీరీస్​లు ఏవీ ప్రదర్శించకుండా నిషేధం(ban) విధించింది. ఇంతకీ ఎవరా నటి.. తెలుసుకుందాం..

    ట్యాక్స్‌‌‌‌ ఎగ్గొట్టిన టాప్​ యాక్ట్రెస్ కు  చైనా(china) అధికారులు భారీ జరిమానా(fine) విధించారు. రూ. 340 కోట్లు కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చైనాలో 30 ఏళ్ల జెంగ్‌‌‌‌ షువాంగ్‌‌‌‌(Zheng Shuang) ప్రముఖ టీవీ, సినిమా నటి. 2019, 2020ల్లో ఆమె నటించిన సినిమాలు, టీవీ సిరీస్‌‌‌‌ల కోసం తీసుకున్న పేమెంట్‌‌‌‌కు సంబంధించి సరిగా పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌(Shanghai Municipal Tax Service) గుర్తించింది. దీంతో శుక్రవారం పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. చైనాలో ప్రజల మధ్య సంపదలో తేడాలను తగ్గించేందుకు ఆ దేశం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం సెలబ్రిటీలపై అక్కడి సర్కారు నిఘా పెరిగింది. పన్ను ఎగవేస్తున్నవాళ్లపై చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎంతటి సెలబ్రెటీలు అయినా వదిలి పెట్టట్లేదు.

    చైనా చట్టాలను పాటించని నటీనటుల షోలను ప్రసారం చేయరు. ఈ నేపథ్యంలో నటి జెంగ్‌‌‌‌ నటించిన ప్రోగ్రామ్‌‌‌‌లను ప్రసారం చేయబోమని నేషనల్‌‌‌‌ రేడియో, టెలివిజన్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ శుక్రవారం వెల్లడించింది. సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఇద్దరు శిశువులను అమెరికాలో వదిలేసిందనే ఆరోపణలపై జెంగ్‌‌‌‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కాగా, ఇటీవల ఇండియాలో కూడా పన్ను ఎగ్గొట్టిన పలువురు సెలబ్రెటీలపై ఇన్​కంట్యాక్స్​ అధికారులు కేసులు పెట్టారు. హీరో విశాల్​ సైతం ఇటీవల ఆదాయపు పన్ను కేసులో కోట్లు మెట్లు సైతం ఎక్కడం తెలిసిందే.
    Published by:Prabhakar Vaddi
    First published: