Home /News /trending /

THE SNAKE THAT HAD BEEN BITTEN BY THE DRUNKARD WAS BITTEN BACK CHEWED IN THE MOUTH AND KILLED THEN THE MAN DIED NK

ముసలాయనను కాటేసిన పాము.. పెద్దాయన అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇది వానాకాలం. పాములు ఎక్కువగా తిరిగే కాలం. తమ పుట్టల్లోకి నీరు వస్తే... పాములు బయటకు వచ్చేస్తాయి. ప్రాణభయంతో కాటేస్తాయి. మరి ఆ ముసలాయన ఏం చేశాడు.. ఏ నిర్ణయం తీసుకున్నాడు.

    ఇది బీహార్... నలందా జిల్లాలోని... మాధోదేవ్ గ్రామంలో జరిగింది. అక్కడి 65 ఏళ్ల ముసలాయన రామ మహతో.. తనను కరిచిన పామును పట్టుకొని... కరకరా కొరికేశాడు. నోట్లో పెట్టుకొని పకోడి తిన్నట్లు నమిలేశాడు. దాంతో పాము చనిపోయింది. కాసేపటికే ఆయన కూడా చనిపోయాడు. అసలేం జరిగిందో... వివరంగా తెలుసుకుందాం. మద్యం మత్తులో ఉన్న రామ మహతో... సాయంత్రం వేళ తన ఇంటి ముందు తాగి తూలుతున్నాడు. అటుగా వెళ్తున్న పాముపై కాలు వెయ్యబోయాడు. దాంతో ప్రాణభయంతో ఆ పాము కసుక్కున కాటేసింది. ముసలాయనకు సూదితో పొడిచినట్లుగా సుర్రు మంది. ఒళ్లు మండింది. "నన్ను కాటేస్తావా... ఏమనుకుంటున్నావ్... నీ సంగతి చెబుతా" అంటూ పామును పట్టుకోవాలని చూశాడు. ఆ పాము కూడా చాలా కోపంగా ఉంది. పారిపోకుండా అక్కడే ఉండి... "రా చూసుకుందాం నువ్వో నేనే" అన్నట్లు ఎదురుచూసింది. కిందకు వంగిన ముసలాయన... పాము దగ్గరకు వెళ్లగానే... ఈసారి ఆ పాము పది సార్లకు పైగా... తలపై కాట్లు వేసింది. అయినా వదలని ముసలాయన... దాన్ని పట్టుకున్నాడు. గబగబా నోట్లో పెట్టుకొని... కరకరా కొరికి కొరికి చంపాడు. దాంతో పాము చచ్చిపోయింది. దాన్ని ఇంటి ముందు ఉన్న చెట్టుకి కిందకు వేలాడుతున్న కొమ్మపై వేలాడదీశాడు.

    రామ మహతోను పాము కాటేయడం, దాన్ని ఆయన కొరకడం... ఇదంతా కొందరు పిల్లలు చూశారు. ఆ ఇంటి తాలూకు వాళ్లు పొలంలో ఉండగా... అక్కడకు వెళ్లి జరిగింది చెప్పారు. వాళ్లు ఆశ్చర్యపోయారు. నమ్మలేదు. కానీ పిల్లలు మొత్తం సినిమా స్టైల్‌లో వివరంగా చెప్పడంతో... ముసలాయనకు మద్యం తాగే అలవాటు ఉంది కాబట్టి... అలా చేసినా చేసుంటాడు అని పరుగున వచ్చారు. ముసలాయన దర్జాగా ఓ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. పాము కాట్ల రంద్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. పద ఆస్పత్రికి వెళ్దామంటే... అవసరం లేదు... అది విషపూరిత పాము కాదు అన్నాడు. నిజమే కావచ్చు అనుకున్నారు. ఎందుకంటే... వాళ్లు వచ్చి చూసేంతవరకూ ముసలాయన బాగానే ఉన్నాడు కదా.

    ఇది కూడా చదవండి: ఏపీలో YCP, BJP మధ్య వార్‌కి బీజం అక్కడ పడిందా?.. అదే అసలు కారణమా?

    ఆ రాత్రి ముసలాయన పడుకున్నాడు. తెల్లారి లేవలేదు. కదిపితే ప్రాణం లేదు. అంతే... ఇంట్లోవాళ్లంతా విషాదంలో మునిగిపోయారు. విషయం ఊరంతా తెలిసింది. తర్వాత పోలీసులకు తెలిసింది. కేసు రాశారు. కానీ ఎవర్నీ అరెస్టు చేసే పరిస్థితి లేదు. ఈ ఘటన మనకు ఎలా ఆశ్చర్యం కలిగిస్తోందో... ఆ ఊరోళ్లకు కూడా అలాగే కలిగించింది. పామును ఎవరైనా కరుస్తారా... అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Bihar, Viral, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు