Home /News /trending /

THE SHORT OR CHADDI ON SLAE AT ONLINE SHOPPING WEBSITE WITH HUGE PRICE AND NETIZENS SHOCKED AND GIVES HILARIOUS REACTIONS SRD

Viral News : 'ఇది వేసుకోవడానికా లేదా బీరువాలో భద్రంగా దాచుకోవడానికా..' ఈ చడ్డీ ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాకే..

Image Credit : Twitter

Image Credit : Twitter

Viral News : ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక రకమైన షార్ట్‌లు అంటే చడ్డీలు గురించి బలమైన చర్చ జరుగుతోంది. ఈ షార్ట్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌ (Online Shopping)పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వస్తువు లేదా బట్టలు కొనుగోలు చేసేటప్పుడు చాలా వెరైటీలను చూడవచ్చు. ఆఫర్లు ,డిస్కౌంట్లు (Offers and Discounts) కూడా అందుబాటులో ఉండనే ఉంటాయి.షాపింగ్‌ను ఇంటి నుండే ఆనందించవచ్చు. ఒకవైపు ఇలా ఉండగా.. మరోవైపు కొందరు స్థానిక మార్కెట్‌కు వెళ్లి షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కొంతమందికి బట్టలంటే చాలా ఇష్టం. వారు బట్టలపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అలాంటి వారు తమకిష్టమైన బట్టల కోసం ఎంత ధర చెల్లించడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక రకమైన షార్ట్‌లు అంటే చడ్డీలు గురించి బలమైన చర్చ జరుగుతోంది. ఈ షార్ట్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

    ఈ చడ్డీల ధర అక్షరాల రూ. 15,000. ఇంత ఖరీదైన షార్ట్‌లను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ చడ్డీలు సాధారణమైనవి కావు. చాలా ఉపయోగకరమైన మరియు సౌకర్యవంతమైన ఈ షార్ట్స్ బాలీవుడ్‌తో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ప్రముఖ హిందీ చిత్రం ``హెరాఫేరి`లో ప్రముఖ నటుడు పరేష్ రావల్ ప్రత్యేక పాత్ర పోషించారు. పరేష్ రావల్ పోషించిన బాబూరావు పాత్ర ఇప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో పరేష్ రావల్ ధరించిన చారల చడ్డీ ఇప్పుడు జోకులకు ప్రధాన అంశంగా మారింది. మన తెలుగు సినిమా అయిన మామగారు సినిమాలో కోట శ్రీనివాసరావు కూడా ఇలాంటి చడ్డీనే వేసుకున్నారు.



    ప్రస్తుతం, ఈ షార్ట్‌లను పోలిన లోదుస్తులు ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ లోదుస్తుల ధర 15 వేల రూపాయలు. ఈ షార్ట్‌ల విక్రయ వివరాలను @vettichennaiguy అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనిపై వందలాది మంది తమాషాగా స్పందించారు.


    చాలా మంది స్థానిక మార్కెట్ల నుంచి వదులుగా ఉండే లోదుస్తులను కొనుగోలు చేస్తారు. రూ. 200 వరకు వదులుగా ఉండే షార్ట్‌లు స్థానిక మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. కానీ, బ్రాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. కొందరు ఇలాంటి షార్ట్‌ల కోసం వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. హెరాఫేరీకి చెందిన బాబూరావు షార్ట్‌లను పోలిన షార్ట్‌లు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో రూ.15,000కు పైగా అమ్ముడవుతుండటం ఇప్పుడు కొందర్నీ షాక్ కు గురిచేస్తుంది.


    ఈ ధర చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "బాబూరావు కూడా ఇంత ఖరీదైన లోదుస్తులు ధరించి ఉండరు." అంటూ బాలీవుడ్ సినిమాతో పోలిక తెస్తూ కామెంట్ చేస్తున్నారు. "ఇవి డిజైనర్ షార్ట్‌లా? గుండె సమస్యలు ఉన్నవారు దయచేసి ఈ షార్ట్‌ల ధరను చూడకండి." అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్ అయితే.. నేను 200 రూపాయలు పెట్టి బట్టలు కూడా కొనను.. బట్టలు లేకుండా అయినా పడుకుంటాను.. ఈ చడ్డీ జీవితంలో కొనను అంటూ సరదాగా కామెంట్ చేశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Online shopping, Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు