THE SELFIE WITH SLIPPERS IS WINNING THE HEARTS OF NETIZENS BA
సెల్ఫీ విత్ స్లిప్పర్: నెటిజన్ల మనసు కొల్లగొడుతున్న ఫొటో
చెప్పులతో సెల్ఫీ తీసుకుంటున్న పిల్లలు (Image:Swati Lakra IPS/ Twitter)
పల్లెటూరిలో చిన్న పిల్లలు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. ఒక్కరికి మాత్రమే చెప్పులున్నాయి. కానీ, సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవాలనే ఆశ. అయితే, ఆ చెప్పే వారికి సెల్ ఫోన్ అయింది.
ప్రస్తుతం దేశంలో సెల్ఫీ మానియా ఏ రేంజ్లో ఉందో ఈ ఒక్క ఫొటోని చూస్తే చాలు. రెండేళ్ల నుంచి ఐదేళ్ల వయసున్న చిన్న పిల్లలు తాము సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఇచ్చిన ఫోజు నెటిజన్ల మనసు కొల్లగొడుతోంది. పల్లెటూరిలో చిన్న పిల్లలు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. ఒక్కరికి మాత్రమే చెప్పులున్నాయి. కానీ, సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవాలనే ఆశ. అయితే, ఆ చెప్పే వారికి సెల్ ఫోన్ అయింది. చెప్పుని సెల్ఫోన్గా భావించి, వారు సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఇచ్చిన స్టిల్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అమాయకమైన పిల్లలు, వారి స్వచ్ఛమైన నవ్వులు, లోకం తెలియని వారి మనసులు చూసి వీక్షకులు తెగ ముచ్చటపడుతున్నారు.
చెప్పులతో సెల్ఫీ తీసుకుంటున్న పిల్లలు (Image:Swati Lakra IPS/ Twitter)
చిన్న పిల్లలు ఇలా చెప్పులతో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఎవరో ఫొటో తీశారు. ఆ ఫాటో ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. అయితే, వారు సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు అవతలి వారు పొటో తీశారా? లేకపోతే వారే చిన్నారుల చేత ఆ ఫొటోను తీయించారా? అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా చిన్నారుల ఫొటో మాత్రం చూడముచ్చటగా ఉంది. ఈ ఫొటోను చూసి అబ్బురపడిన ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.