ఎలక్షన్ రిజల్ట్స్ రోజున రికార్డు స్థాయిలో కరెంట్ వాడిన హైదరాబాదీలు

వాస్తవానికి రిజల్ట్స్‌కి మూడురోజుల ముందే ఆల్‌టైమ్ రికార్డు కరెంట్ డిమాండ్ 3276 మెగవాట్లకి చేరింది. అయితే.. వినియోగ పరంగా 67 యూనిట్లు మించలేదు.. కానీ, రిజల్ట్స్ రోజున మాత్రం 68.95 మిలియన్ యూనిట్లను వాడారు. డిమాండ్ చూస్తే 3257 మెగావాట్లు నమోదైంది.

news18-telugu
Updated: May 25, 2019, 11:20 AM IST
ఎలక్షన్ రిజల్ట్స్ రోజున రికార్డు స్థాయిలో కరెంట్ వాడిన హైదరాబాదీలు
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్(File)
  • Share this:
తాజాగా ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ సమయంలో నగరంలో కరెంట్‌ని ఎక్కువగా వినియోగించారని అధికారులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 68.95 మిలియన్ యూనిట్లని వాడారని టీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ తెలిపారు. బయటచూస్తే ఎండలు.. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్.. దీంతో రిజల్ట్స్‌ని చూస్తూ ఎక్కడివారు అక్కడే టీవీలకు అతుక్కుపోయారు. టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా పనిచేస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా కరెంట్ వినియోగం ఫుల్‌గా ఉంది.

వాస్తవానికి రిజల్ట్స్‌కి మూడురోజుల ముందే ఆల్‌టైమ్ రికార్డు కరెంట్ డిమాండ్ 3276 మెగవాట్లకి చేరింది. అయితే.. వినియోగ పరంగా 67 యూనిట్లు మించలేదు.. కానీ, రిజల్ట్స్ రోజున మాత్రం 68.95 మిలియన్ యూనిట్లను వాడారు. డిమాండ్ చూస్తే 3257 మెగావాట్లు నమోదైంది.

ఇక ఎండల తీవ్రత కూడా పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో వినియోగం మరింత పెరిగేలా 70 మిలియన్ యూనిట్లు దాటేలా ఉందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..Govt Jobs : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. వేల ఉద్యోగాల ఖాళీలు.. అప్లై చేసేయండి..

First published: May 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>