హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Twitter: ట్విట్టర్‌ లైవ్‌లోకి కమిషనర్.. వింత ట్వీట్ చేసిన ఓ లవర్.. కమిషనర్ నుంచి మనోడికి దిమ్మతిరిగే ఆన్సర్..!

Twitter: ట్విట్టర్‌ లైవ్‌లోకి కమిషనర్.. వింత ట్వీట్ చేసిన ఓ లవర్.. కమిషనర్ నుంచి మనోడికి దిమ్మతిరిగే ఆన్సర్..!

నెటిజన్లతో సీపీ ముఖాముఖి

నెటిజన్లతో సీపీ ముఖాముఖి

సంపన్నుల దగ్గర నుంచి సామాన్యుల దాకా అందరి చేతిలో కనిపిస్తున్న ఒకేఒక్క సాధనం స్మార్ట్‌ఫోన్. బడ్జెట్ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తుండటంతో వాటిని కొనేందుకు సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. స్మార్ట్‌ఫోన్ కొన్న తర్వాత సోషల్ మీడియాను వినియోగించని వారంటూ...

ఇంకా చదవండి ...

సంపన్నుల దగ్గర నుంచి సామాన్యుల దాకా అందరి చేతిలో కనిపిస్తున్న ఒకేఒక్క సాధనం స్మార్ట్‌ఫోన్. బడ్జెట్ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తుండటంతో వాటిని కొనేందుకు సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. స్మార్ట్‌ఫోన్ కొన్న తర్వాత సోషల్ మీడియాను వినియోగించని వారంటూ ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు కూడా ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా సోషల్ మీడియాను.. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌ను వినియోగించుకుని ప్రజలు మోసాలకు, ఆన్‌లైన్ కేటుగాళ్లకు చిక్కకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా.. పోలీసు ఉన్నతాధికారులు కూడా అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేస్తుంటారు. అలాంటి ఓ ప్రయత్నమే పుణె నగర పోలీసులు చేశారు. ‘లెట్స్‌టాక్‌సీపీపుణెసిటీ’ పేరుతో పుణె నగర కమిషనర్ అమితాబ్ గుప్తా ట్విట్టర్ లైవ్‌లోకి వచ్చారు.

ఈ లైవ్‌లో భాగంగా.. సీపీ ముందు ఓ నెటిజన్ విచిత్రమైన ప్రతిపాదన పెట్టాడు. పోలీసులంటే ఏ సమస్యనైనా పరిష్కరిస్తారనుకున్నాడో ఏమో ఏకంగా తన లవ్ మేటర్‌ను సీపీకి చెప్పాడు. తన లవ్ ప్రపోజల్‌ను అంగీకరించేలా తన గర్ల్ ఫ్రెండ్‌ను ఒప్పించాలని సీపీని కోరాడు. అయితే.. ఏమాత్రం సహనం కోల్పోని సీపీ అమితాబ్ గుప్తా శాంతంగా సమాధానమిచ్చారు. ఆమె అనుమతి లేకుండా, ఆమెకు ఇష్టం లేకుండా ఈ విషయంలో నీకు ఎలాంటి సాయం చేయలేమని సీపీ చెప్పారు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏమీ చేయవద్దని ఆయన చెప్పారు.

ఒకవేళ ఆమె ఏదో ఒకరోజు నీ ప్రేమను అంగీకరిస్తే.. తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు నీకు ఉంటాయని సీపీ ఆ యువకుడికి సమాధానమిచ్చారు. అంతేకాదు.. ‘నోమీన్స్‌నో’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఆయన జతచేసి ఆయన ట్వీట్ చేశారు. సీపీ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆయన నెటిజన్లకు పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా కోవిడ్-19 ప్రోటోకాల్స్, మహిళల భద్రత అంశాలపై ఆయన నెటిజన్లతో ముచ్చటించారు.

First published:

Tags: Police, Pune, Pune news, Twitter

ఉత్తమ కథలు