ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల బదిలీలు... రాష్ట్రపతి భవన్ నుంచీ ఆదేశాలు జారీ...

New Governors : కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మార్పులు చేర్పులూ జరుగుతున్నాయి. గవర్నర్ల బదిలీ అంశం కూడా అందులో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 20, 2019, 1:40 PM IST
ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల బదిలీలు... రాష్ట్రపతి భవన్ నుంచీ ఆదేశాలు జారీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివిధ రాష్ట్రాలకు గవర్నర్ల బదిలీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్ పటేల్... ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అలాగే... బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్‌ఖార్‌ను నియమించారు. అలాగే... త్రిపుర గవర్నర్‌గా రమేష్ బాయిస్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక బీహార్ గవర్నర్‌గా ఉన్న లాల్ జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. బీహార్ గవర్నర్‌గా ఫాగు చౌహాన్‌ను నియమించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్.ఎన్.రవి నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయా రాష్ట్రాలకు బదిలీ అయినవారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వారి నియామకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు