పెళ్లి వేడుకలోకి పోలీసుల ఎంట్రీ.. వధువు కళ్ల ముందే వరుడు అరెస్ట్.. ఆమె చేసిన పనికి అందరూ ఫిదా

ప్రతీకాత్మక చిత్రం

అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్ధం కాలేదు. వెంటనే తేరుకొని పోలీసుల కారు వెంట పరుగులు పెట్టింది. తన భర్తను వదిలేయమని ప్రాధేయపడింది.

 • Share this:
  పెళ్లికి అంతా సిద్ధమయింది. బంధువులంతా వచ్చారు. మరికాసేపట్లో వధువు చేతికి వరుడు వెడ్డింగ్ రింగ్ తొడుగుతాడన్న సమయంలో ఊహించని ఘటన జరిగింది.  వివాహ తంతు  జరుగుతుండగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి పెళ్లిని నిలిపివేశారు. పెళ్లి కొడుకును అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లారు. ఆ హఠాత్పరిణామంతో వధువు షాక్ తింది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్ధం కాలేదు. వెంటనే తేరుకొని పోలీసుల కారు వెంట పరుగులు పెట్టింది. తన భర్తను వదిలేయమని ప్రాధేయపడింది.  భర్త కోసం ఆమె వేడుకుంటున్న  తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. పోలీసుల కారు వెంట వధువు పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ఈ ఘటన మన ఇండియాలో కాదు.. ఈక్వెడార్ దేశంలో జరిగింది.

  డైలీ మెయిల్ కథన ప్రకారం.. ఈక్వెడార్‌లోని ఎల్ గువాబో క్యాంటన్ నగరానికి చెందిన యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. పెద్దల సమక్షంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారు  కూడా ఓకే చెప్పడంతో చర్చిలో పెళ్లి ఏర్పాటు చేశారు. ఐతే మరి కాసేపట్లో వివాహం ముగుస్తుందనగా పోలీసులు అక్కడికి వచ్చారు. నేరుగా పెళ్లి కుమారుడి వద్దకు వెళ్లి అరెస్ట్ చేశారు. చేతులకు బేడీలు వేసి కారు వద్దకు వెళ్లారు.  అతడిని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఊహించని ఆ పరిణామాన్ని చూసి వధువు షాక్ తింది. పోలీస్ కారు వెంట పరుగెడుతూ.. తన భర్తను వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. కానీ వారు మాత్రం వినలేదు.

  Foreign Bride: బీహార్ అబ్బాయితో ఫ్రాన్స్ అమ్మాయి పెళ్లి.. అదిరిపోయే లవ్ స్టోరీ..

  ఎందుకు అరెస్ట్ చేశారు..?

  అతడికి ఇంతకు ముందే పెళ్లయింది.  ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ  భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల ఒప్పందం ప్రకారం.. మొదటి భార్యకు అతడు భరణం చెల్లించాల్సి ఉంది. కానీ ఇవ్వలేదు.   పిల్లల బాగోగుల కోసం కూడా ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఈ నేపథ్యంలో తన మాజీ భర్తపై ఆ మహిళ పోలీసుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి అతడి గురించి ఆరా తీశారు. అతడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి.. నేరుగా అక్కడికే వెళ్లారు. పెళ్లి తంతును  మధ్యలో ఆపేసి జైలుకు లాక్కెల్లారు.

  Viral Video: ఇదేందిదీ... డ్రైనేజీ పైపుల్లో నోట్ల కట్టలు.. ఎక్కడా చూడలే.. షాక్ అవ్వాల్సిందే

  ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అలా పెళ్లి మధ్యలో అరెస్ట్ చేయాల్సింది కాదని కొందరు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం వరుడి తీరును తప్పుబట్టారు. మొదటి భార్యకు సాయం చేయకుండా.. రెండో పెళ్లి చేసుకుంటావా? అని విమర్శిస్తున్నారు. ఐతే ఆ పెళ్లి కూతురును మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. భర్త కోసం పోలీసుల కారు వెంట పరుగెత్తడం చూసి ఫిదా అయ్యారు. భర్త అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్స్  పెడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: