Home /News /trending /

THE PHOTO OF DIRECTOR RANGOPAL VARMA LANDING IN A PUB WENT VIRAL ON SOCIAL MEDIA SNR

పబ్‌లో సిగార్‌, ఫిగర్‌తో పెగ్గేస్తూ ఆర్జీవీ జల్సా..వామ్మో ఏందయ్యా ఇది మేం ఎప్పుడూ చూడలా.

Photo Credit: Twitter

Photo Credit: Twitter

Video Viral: డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ పోస్ట్ చేసిన సిల్లీ ఫోటో, వీడియోకి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెగ్గు, సిగర్, ఫిగర్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటో చూసి మంచి క్యాప్షన్ పెడితో లక్ష ఇస్తానంటూ చేసిన ప్రకటనపై నెటిజన్లు డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు.

ఇంకా చదవండి ...
వంకర, టింకర లాజిక్కులు, విచిత్రమైన పోస్ట్‌లు, వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ (Rangopal Varma)మరోసారి నెటిజన్ల(Netizens)కు పరీక్ష పెట్టాడు. పబ్‌(Pub)లో పక్కనే ఓ మహిళను పక్కనపెట్టుకొని మందు, దమ్ము కొడుతున్న వీడియోని, ఫోటోను తన సోషల్ మీడియా (Social media)పేజ్‌లో పోస్ట్ చేశాడు. విచిత్రం ఏమిటంటే ఈ వీడియోలో డైరెక్టర్ ఆర్జీవీ హీరోలా ఫీలవుతూ..విలన్‌ షేడ్స్‌ ప్రదర్శించారు. ఓ దమ్ము కొడుతూ మధ్యలో మందు సిప్‌ చేస్తూ..ఆ గ్యాంప్‌లో పక్కనే ఉన్న అమ్మాయి ఇనాయ సుల్తానా (Inaya sultana)బుగ్గపై ముద్దులు పెడుతూ వీడియోని షూట్ చేశాడు. కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా, పబ్‌ కల్చర్‌ని కళ్లకు కట్టినట్లుగా ఉన్న ఈవీడియోని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఓ పరీక్ష పెట్టాడు. తన వీడియో చూసి మంచి క్యాప్షన్‌ పెట్టమని..అలా చేస్తే లక్ష రూపాయల (1Lakh) ఇస్తానంటూ నజరానా ప్రకటించారు డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. ఆర్జీవీ షేర్ చేసిన వీడియో, ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు క్యాప్షన్‌ పెడుతున్నారు. వర్మ అంటే అంతకు మించి అన్నట్లుగా ఉంది వీడియోలో ఉన్న అమ్మాయి ప్రవర్తన. రాంగోపాల్‌ వర్మను పెనవేసుకొని మరీ డ్యాన్స్‌ చేస్తూ మధ్యలో ఆమె కూడా మందేస్తూ వీడియోలో కనిపించింది. రెండు వీడియోల్లో ఒక దాంట్లో దమ్ము కొడుతూ డ్యాన్స్ చేస్తుంటే రెండో వీడియోలో చేతిలో మందు గ్లాస్‌ పట్టుకొని మరో చేతితో అమ్మాయిని గట్టిగా హగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు వర్మ.

పెగ్గు, ఫిగర్, సిగర్‌తో జల్సా..
రాంగోపాల్‌వర్మను సినీ క్రిటిక్స్‌ తిట్టుకుంటున్న..ఆయన మెసేజ్‌, స్టేట్‌మెంట్‌ల కోసం చాలా మంది సినీ అభిమానులు ఎప్పుడూ ఆతృతగా ఎదురుచూస్తునే ఉంటారు. వర్మతో పబ్‌లో చిందులేసిన లేడీ ఇనయా సుల్తానా కూడా రాంగోపాల్‌వర్మకు ఏమాత్రం తీసిపోలేదు. ఆమె కూడా తన ట్విట్టర్‌ ఖాతాలో మరో వీడియోని షేర్ చేసుకుంది. వీళ్లిద్దరి పంబ్‌లో చేసిన రొమాన్స్‌ సోషల్ మీడియాలో గబ్బు గబ్బు అవుతోంది.

వర్మ రూటే సెవరేటు ..
రాష్ట్రంలో, దేశంలో ఎన్ని హాట్ టాపిక్స్‌ నడుస్తున్న వర్మ మాత్రం తన నైజాన్ని మార్చుకోరు. సబ్జెక్ట్‌తో పని లేకుండా తనకు నచ్చినట్లు, తనకు తోచింది చేయడం ఆయన మేనరిజం. అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

తగ్గేదేలే అంటున్న డైరెక్టర్ ..
వీడియో, ఫోటోలు పోస్ట్ చేసి నగదు ప్రకటించడం రాంగోపాల్‌వర్మకు కొత్త విషయం కాదు. గతంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా టైమ్‌లో కూడా ఒక పాత్ర కోసం ఓ వ్యక్తి ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అతని అడ్రస్‌ కనిపెడితే లక్ష రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. కనిపెట్టిన జర్నలిస్ట్‌కి లక్ష రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు వర్మ. మరీ ఈసారి వర్మ ఫోటోకి కనెక్ట్‌ అయ్యేలా క్యాప్షన్ పెట్టి లక్ష కొట్టేసే లక్కీ ఫెలో ఎవరో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Ramgopal varma, RGV, Social Media

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు