Home /News /trending /

THE PEOPLE OF RAJASTHAN HAVE SET UP SPECIAL SHELTERS FOR BIRD SHELTER THE NEWS IS GOING VIRAL ON SOCIAL MEDIA SNR

పక్షులు, పావురాల కోసం అక్కడ ప్రత్యేకంగా ఇళ్లు..గొప్పొళ్లు సామీ మీరు

Photo Credit: Youtube

Photo Credit: Youtube

Rajasthan: రాజస్థాన్‌లో ఓ ఊళ్లో పావురాలు, పక్షుల కోసం గ్రామస్తులు ప్రత్యేక వసతి గదులు ఏర్పాటు చేశారు. రేడియేషన్‌, జంతువుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న పక్షుల పట్ల జాలితో పెద్ద మనుసు చేసుకున్నారు. వాటి కోసం నివాస పెట్టేలను తయారు చేసి ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని శంకర గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు.

ఇంకా చదవండి ...
కళ్ల ముందు మనుషుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూసే జనం ఉన్న ఈరోజుల్లో అక్కడి వాళ్లు మాత్రం పక్షులను కూడా మనుషులతో సమానంగా ప్రేమిస్తున్నారు. వాటి ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పక్షలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. అందరూ ఆశ్చర్యపోవడమే కాదు కనువిప్పు కలిగించే ఈ ఘటన రాజస్థాన్‌(Rajasthan)లో జరిగింది. మనుషుల అవసరాల దృష్ట్య స్మార్ట్‌ ఫోన్‌లుsmart phones, ఇంటర్‌సేవ(Internet service)వాడకం విస్తృతంగా పెరిగిపోతోంది. ఈనేపధ్యంలో గ్రామాల్లో సెల్‌ఫోన్‌ టవర్లు (Cell towers)ఏర్పాటు చేయడంతో అక్కడున్న పావురాలు, కాకులు, పక్షులకు రేడియేషన్‌ ప్రభావం పడుతోంది. వాటి నుంచి వెలువడే శబ్ధకాలుష్యానికి గురువుతున్నాయి పక్షులు, పావురాలు. ఇలాంటి పరిస్థితి నుంచి పక్షులు(Birds),పావురాల(Pigeons)ను కాపాడేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు శంకర గ్రామస్తులు. రాజస్థాన్‌ (Rajasthan)లోని బుండి (Bundi)జిల్లాలోని శంకర (Sankara)అనే గ్రామస్తులు పక్షలు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇళ్లకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Video viral)అవుతోంది. శంకర గ్రామస్తులకు పావురాలు, పక్షుల శబ్ధాలు వింటే తప్ప తెల్లవారదు. అలాంటి గ్రామంలో పిల్లులు, కుక్కల బారినపడి సుమారు వందలాది పావురాలు చనిపోయాయి. నోరు లేని పక్షలు ప్రాణాలు కోల్పోవడం చూసి దిగులు చెందిన గ్రామస్తులు వాటిని రక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని సుమారు 500కుపైగా ఉన్న పావురాలు, పక్షల కోసం టిన్‌ పీపాల(Tin casks)తో ప్రత్యేకమైన షెల్టర్‌(Shelters)లను తయారు చేయించారు. వాటిని పక్షులు వాలే ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.

పక్షులకు ప్రత్యేక నివాస గదులు..
శంకర గ్రామస్తులకు వచ్చిన ఉపాయంతో నోరు పక్షలకు సురక్షితమైన గూడు దొరికినట్లైంది. రోజు వాటిల్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాయి. గ్రామంలో ఉన్న పక్షులు, పావురాలకు గూడు ఏర్పాటు చేసిన ఊరి జనం ఆహారం, నీళ్ల కోసం తరచూ బయటకు వస్తుండటం చూసి ఆహారం, నీళ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆహారం, నీళ్ల కోసం వచ్చే సమయాల్లో కూడా పావురాలు ప్రాణాలు కోల్పోకూడదనే మంచి ఆలోచనతో గ్రామస్తులంత మరో ఉపాయాన్ని చూస్తున్నారు.

పక్షి ప్రేమికులపై ప్రశంసలు..
పర్యావరణంలో వాయు, జల,శబ్ధ కాలుష్యం ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ప్రజలకు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తున్నాయి. మనుషుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు చూపలేని శ్రద్ధ పక్షులు, పావురాల కోసం రాజస్థాన్‌లోని ఓ గ్రామ ప్రజలు చూపిస్తున్న శ్రద్ధను నెటిజన్లు తెగ అభినందిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Rajasthan, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు