ఓ పనస చెట్టుకి ఇంత సెక్యూరిటీనా... సీసీటీవీ, టచ్ చేస్తే మొబైల్ అలర్ట్..

కొన్ని రోజుల క్రితం పరమేష్ బయటకు వెళ్లినప్పుడు కొందరు ఆకతాయిలు చెట్టు నుంచి కాయలు కోసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ చెట్టుకు రక్షణ కల్పించాలని నిర్ణయించాడు పరమేష్.

news18-telugu
Updated: September 14, 2019, 3:52 PM IST
ఓ పనస చెట్టుకి ఇంత సెక్యూరిటీనా... సీసీటీవీ, టచ్ చేస్తే మొబైల్ అలర్ట్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 14, 2019, 3:52 PM IST
అనగనగా ఓ ఊరు. అందులో ఓ ఇంట్లో ఓ చెట్టు. ఆ చెట్టుకి చుట్టూ కరెంటు తీగలు. సీసీటీవీ కెమెరాలు. ఒకవేళ ఆ చెట్టును ఎవరైనా టచ్ చేస్తే వెంటనే ఆ ఇంటి యజమానికి మొబైల్ అలర్ట్ వచ్చేస్తుంది. ఇంతగా సెక్యూరిటీ కల్పించడానికి ఆ చెట్టులో అంత స్పెషాలిటీ ఏముంది? అంటారా? ఉంది. దేశంలో ఇలాంటి అరుదైన చెట్లు మరెక్కడా దొరకడం లేదు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని ఓ మారుమూల గ్రామంలో ఉంది. ఆ ఇంటి యజమాని పేరు పరమేశు. ఆ పరమేశు తండ్రి ఎప్పుడో 37 ఏళ్ల క్రితం ఆ చెట్టును నాటారట. అది పనస చెట్టు. పనస చెట్లు చాలా ఉంటాయి కదా అనుకోవచ్చు. కానీ, ఇది చాలా అరుదైన పనస. ఈ చెట్టు నుంచి కాసే పనసకాయలోని తొనలు రాగి రంగులో ఉంటాయి. సాధారణంగా పనసకాయల తొనలు గోధుమ - లేత పసుపు రంగులో ఉంటాయి. కానీ, ఈ చెట్టు పనస తొనలు మాత్రం రాగి రంగులో ఉండడమే విశేషం. ఈ ఒక్క చెట్టు సంవత్సరానికి 450 నుంచి 500 పండ్లు కాస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం


ప్రపంచానికి పరిచయం అయిందిలా...

2017లో బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ & రిసెర్స్ నిర్వహించిన మామిడి, పనసపండ్ల ఎగ్జిబిషన్‌లో ఇది వెలుగులోకి వచ్చింది. దానిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరమేశు తోటలో ఉన్న పనసచెట్టు గొప్పదనాన్ని గుర్తించిన ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు.. ఆ పనస చెట్టు నుంచి కొత్త వంగడాలను సృష్టించారు. వాటికి సిద్ధు వెరైటీ (వెంకటేష్ తండ్రి పేరు) అని పేరు పెట్టారు. తల్లి మొక్క నుంచి మొక్కలను తయారు చేసి రైతులకు అందించారు. 2018 సంవత్సరంలో 5వేల మొక్కలు సృష్టించారు. ఈ సంవత్సరం 15వేల మొక్కలు తయారు చేసి రైతులకు పంపిణీ చేశారు. ఒక్కో మొక్కను రూ.200 చొప్పున అమ్మారు. మొక్కల తయారీకి రూ.3లక్షల ఖర్చయింది. వాటి మీద రూ.7లక్షల ఆదాయం వచ్చింది. పరమేష్‌కు రూ.5లక్షల రాయల్టీ కూడా లభించింది.ప్రతీకాత్మక చిత్రం


కొన్ని రోజుల క్రితం పరమేష్ బయటకు వెళ్లినప్పుడు కొందరు ఆకతాయిలు చెట్టు నుంచి కాయలు కోసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ చెట్టుకు రక్షణ కల్పించాలని నిర్ణయించాడు పరమేష్. రూ.24వేలు ఖర్చు పెట్టి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. ఎవరైనా చెట్టు దగ్గరకు రాగానే మొబైల్‌కు అలర్ట్ వస్తుంది.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...