హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: గత రెండేళ్ల బతుకెలా ఉందో కారు వీడియోతో చెప్పిన నెటిజన్​.. వీడియో వైరల్​

Viral video: గత రెండేళ్ల బతుకెలా ఉందో కారు వీడియోతో చెప్పిన నెటిజన్​.. వీడియో వైరల్​

లోయలో పడిపోతున్న కారు (ఫొటో: ట్విటర్​)

లోయలో పడిపోతున్న కారు (ఫొటో: ట్విటర్​)

ఓ కారు(car)... ఎవరో డ్రైవ్(drive) చేసినట్లుగా వెళ్లి పక్కనే ఉన్న లోయ(valley)లో పడుతుంది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌(viral)గా మారింది. అయితే ఈ వీడియో(video) పోస్టుచేసిన జోష్​ వార్​బటన్(josh warburton2) అనే వ్యక్తి మాత్రం ఓ సరదా ట్యాగ్​(tag)ను సైతం జోడించారండి. 2020 టు 2021.. అని అంటే మన జీవితాలు ఈ రెండేళ్లలో ఎలా మలుపులు(turns) తిరిగాయో ఈ వీడియో ద్వారా సదరు నెటిజన్(netizen)​ వ్యక్తపరుస్తున్నాడు.

ఇంకా చదవండి ...

సోషల్ మీడియా (social media) ప్రపంచాన్ని ముందుకు వెనక్కే కాదు. పైకి కిందకి కూడా చేస్తుంది. అంత పవర్​ ఉంది. సాధారణ వ్యక్తిని పాపులర్​ చేయగలదు. పాపులర్​ వ్యక్తిని అధ:పాతాళానికి తొక్కేయగలదు. ఈదే కోవలో సోషల్​ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టుచేసే వీడియోలు తెగ వైరల్​ అయిపోతుంటాయి. అందులో కొన్ని మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. అలాంటి వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ కారు(car)... ఎవరో డ్రైవ్(drive) చేసినట్లుగా వెళ్లి పక్కనే ఉన్న లోయ(valley)లో పడుతుంది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌(viral)గా మారింది. అయితే ఈ వీడియో(video) పోస్టుచేసిన జోష్​ వార్​బటన్(josh warburton2) అనే వ్యక్తి మాత్రం ఓ సరదా ట్యాగ్​(tag)ను సైతం జోడించారండి. 2020 టు 2021.. అని అంటే మన జీవితాలు ఈ రెండేళ్లలో ఎలా మలుపులు(turns) తిరిగాయో ఈ వీడియో ద్వారా సదరు నెటిజన్(netizen)​ వ్యక్తపరుస్తున్నాడు. 2020లో కోవిడ్​ వచ్చి ప్రపంచం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. లాక్​డౌన్​తో ప్రపంచం స్తంభించిపోయింది. ఇక అయిపోయింది అనుకునే తరుణంలో 2021లో సెకండ్​ వేవ్​ వచ్చి మళ్లీ లాక్​డౌన్​ రాజ్యమేలుతోంది. ఇదే విషయాన్ని ఈ వీడియో జత చేసి అతను చెప్పినట్టుంది. అదేంటో ఓ లుక్కేద్దాం..

ఈ వైరల్ వీడియో చూస్తే.. ఓ కారు యాక్సిడెంట్ అయినట్లు అనిపిస్తోంది కదా. కారు పూర్తిగా ఓ పక్కకు ఒరిగిపోయి ఉంది. ఈ యాక్సిడెంట్ చాలా రోజుల కింద జరిగింది కానీ, ఎక్కడ జరిగిందో తెలియదు. అధికారులు దాన్ని క్రేన్‌ సాయంతో తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్‌తో నిఠారుగా నిల్చున్న కారును సరిచేశారు. ఇక అంతే.. ఒక్కసారిగా పరుగులు తీసింది. ఎవరో కారులో ఉండి డ్రైవ్‌ చేస్తున్నట్లుగానే.. వెళ్లి పక్కనే ఉన్నా లోయలో పడిపోయింది. జరిగిన ప్రమాదంలో తక్కువగానే డ్యామేజ్‌ అయిన కారు.. ఇప్పుడు లోయలో పడటంతో భారీగానే నష్టం జరిగినట్లయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. దురదృష్టం వెంటాడితే, ఏ అదృష్టం కాపాడదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

First published:

Tags: Car accident, Corona, Covid, Galwan Valley, Viral tweet, Viral Videos

ఉత్తమ కథలు