బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్... తేనెటీగల రక్షణ కోసం...

Bee Stops : మన దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. వాటిని కాపాడేందుకు నెదర్లాండ్స్ తీసుకున్న నిర్ణయం, చేపట్టిన ప్రాజెక్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 2:09 PM IST
బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్... తేనెటీగల రక్షణ కోసం...
బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్ (Image : instagram/uitdragerij)
  • Share this:
Netherlands : మనలో చాలా మంది తేనె వాడతారు. బరువు తగ్గేందుకూ, ఆరోగ్యాన్ని పెంచుకునేందుకూ తేనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాంటి తేనెటీగలు మాత్రం... మనం వాడుతున్న సెల్‌ఫోన్లూ, డిజిటల్ టెక్నాలజీ వల్ల చనిపోతున్నాయి. యూరప్ దేశం నెదర్లాండ్స్‌లో 358 తేనెటీగల జాతులు ఉండేవి. వాటిలో సగానికి పైగా ఇప్పుడు లేవు. మిగతావి అంతరించే దశలో ఉన్నాయి. ఇది గమనించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం... తేనెటీగల పెంపకం కోసం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. దేశంలోని అట్రెచ్ నగరంలో బస్టాప్‌లను తేనెటీగల ఆవాసాలుగా మార్చేసింది. ప్రతీ బస్టాప్ పైనా చిన్న చిన్న పూల మొక్కలు పెరిగేలా చేసింది. ఫలితంగా తేనెటీగల రాక మొదలైంది. మొత్తం 316 బస్టాప్‌ల పైకప్పులు ఇప్పుడు గ్రీనరీతో, పూల మొక్కలతో ఆకట్టుకుంటున్నాయి.

netherlands,bus stops,bee stops,pollusion, green city, నెదర్లాండ్స్, బస్సులు,తేనెటీగలు,అంతరించిపోతున్న తేనెటీగలు,తేనెటీగల పెంపకం,
బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్ (Image : instagram/uitdragerij)


అట్రెచ్ నగరం... నెదర్లాండ్స్‌లో నాలుగో పెద్ద సిటీ. ఇప్పుడు ఇక్కడ తేనెటీగలు, ఇతర కీటకాలూ... పూలమొక్కలపై వాలుతూ... కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.

బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్ (Image : instagram/uitdragerij)
ఈ గ్రీన్ రూఫ్‌లు... దుమ్మును పీల్చుకునేందుకూ, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు కూడా ఏర్పాట్లున్నాయి.

బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్ (Image : Twitter/Jolanda van Ginkel)


పచ్చదనాన్ని పెంచేందుకూ, కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా ఇదో మంచి ఆలోచన అంటున్నారు నేచర్ లవర్స్.
బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్ (Image : instagram/evagladness)


ఈ బస్టాప్‌ల కింద ఉండే ప్రయాణికులకు చల్లగా ఉంటోదనీ, ఇది చాలా బాగుందని ప్రజలు చెబుతున్నారు. త్వరలో ఈ బస్టాప్‌లపై సోలార్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేస్తామని అట్రెచ్ అధికారులు తెలిపారు.

బస్టాప్‌లను 'బీ'స్టాప్‌లుగా మార్చేసిన నెదర్లాండ్స్ (Image : instagram/uitdragerij)


అట్రెచ్‌లో డీజిల్ బస్సుల స్థానంలో... 2028 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనే ప్రణాళిక కూడా ఉంది.
First published: July 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు