హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Nandi drinking Milk: ఓ మై గాడ్​.. పాలు తాగుతున్న నంది విగ్రహం..! ఆలయానికి క్యూ కట్టిన భక్తజనం.. 

Nandi drinking Milk: ఓ మై గాడ్​.. పాలు తాగుతున్న నంది విగ్రహం..! ఆలయానికి క్యూ కట్టిన భక్తజనం.. 

 శివుడి దగ్గర ఉండే నంది విగ్రహం పాలు తాగడం ఆసక్తికరంగా మారింది. మహా శివరాత్రి అనంతరం ఇలా జరగడంతో ఆ ఆలయానికి భక్తులు పాలతో, భక్తి పారవశ్యంలో క్యూ కట్టారు.

శివుడి దగ్గర ఉండే నంది విగ్రహం పాలు తాగడం ఆసక్తికరంగా మారింది. మహా శివరాత్రి అనంతరం ఇలా జరగడంతో ఆ ఆలయానికి భక్తులు పాలతో, భక్తి పారవశ్యంలో క్యూ కట్టారు.

శివుడి దగ్గర ఉండే నంది విగ్రహం పాలు తాగడం ఆసక్తికరంగా మారింది. మహా శివరాత్రి అనంతరం ఇలా జరగడంతో ఆ ఆలయానికి భక్తులు పాలతో, భక్తి పారవశ్యంలో క్యూ కట్టారు.

  దేవుడు (God) ఉన్నాడా? లేడా..? ఈ ప్రశ్న చాలా మందికి చిరాకు తెప్పించొచ్చు. మరికొందరికి ఆసక్తిగా అనిపించొచ్చు. దేవుడిని నమ్మే వాళ్లు అయితే ఈ ప్రశ్న వేస్తే మనపై తాండవమో చూపిస్తారు. ఇక నమ్మని వాళ్లయితే దొంగ స్వాములు, పాస్టర్లు అబ్బో ఇలాగ ఎన్నో ఉదాహరణలతో దట్స్​ ఆల్​ యువరానర్​ అంటూ ముగించేస్తారు. ఇక అసలు దేవుడు ఉన్నాడో లేడో అని నమ్మి నమ్మలేకుండా మధ్యలో ఉండే వాళ్లయితే ఓ నవ్వు నవ్వి వెళ్లిపోతారు.

  దేవుడి విషయంలో ఎన్నో నమ్మలేనివి వింటుంటాం.. చూశాం కూడా. గణేశుడి విగ్రహం (ganesh Idol) పాలు తాగడం, సాయిబాబా విభూతి రాల్చడం.. శ్రీరాముడి విగ్రహం కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇలా ఎన్నో.. ఎన్నో విచిత్ర సంఘటనలు మన కళ్లెదుటే జరిగాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయిది కూడా అలాంటిదే..  శివుడి దగ్గర ఉండే నంది విగ్రహం పాలు తాగుతుందట (Nandi drinking Milk). ఈ విషయం ఆసక్తికరంగా మారింది. మహా శివరాత్రి అనంతరం ఇలా జరగడంతో ఆ ఆలయానికి భక్తులు పాలతో, భక్తి పారవశ్యంలో క్యూ కట్టారు.

  గిన్నెలు, చెంచాలతో నందికి పాలు..

  ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా క్రాంతినగర్‌లోని శివాలయంలో  (God shiva temple) జరిగిందీ ఘటన. ఆనోటా ఈనోటా పాకి మ్యాటర్‌ జనం చెవిలో పడడంతో ఈ వింత (Nandi drinking Milk) చూసేందుకు క్యూకట్టారు. గాండ్ల సంఘం శివాలయంలో  (God shiva temple) నందికి భక్తులు. పాలు పోశారు.  అయితే ఎప్పుడూ లేనిది నంది పాలు తాగడం (Nandi drinking Milk) గమనించారు. ముందు షాకయ్యారు. ఆ తర్వాత గిన్నెలు, చెంచాలతో నందికి పాలు తాగించారు. గిన్నెలో పాలు నంది (Nandi) గుటగుటా తాగినట్టే కనిపిస్తోంది. నిజంగానే నంది పాలు తాగుతుందా? లేదంటే విగ్రహం (Statue) పాలను పీల్చేస్తుందా? అన్న విషయం తెలియరాలేదు. భక్తులు మాత్రం దేవుడి మహిమ (Nandi drinking Milk) అంటూ ఉప్పొంగిపోతున్నారు.

  ఇదంతా శివయ్య లీలంటూ..

  మహా శివరాత్రి (Maha shivratri) మహోత్సవం ముగిసిన తర్వాత ఇలాంటిది (Nandi drinking Milk) జరగడంతో ఇదంతా శివయ్య లీలంటూ అక్కడికి వచ్చిన భక్తులు అనుకుంటున్నారు. ఆలయానికి చేరుకున్న భక్తులు నంది విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడు పాలు తాగడం, సాయిబాబా విభూతి రాల్చడం.. శ్రీరాముడు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి ఘటనలు గతంలో తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే.


  కాగా, ఇలాంటి ఘటన ఇటీవలె ఒకటి జరిగింది. హైదరాబాద్​లోని శంషాబాద్ కట్టమైసమ్మ ఆలయంలో వింత చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహం పాలుతాగుతోందని ప్రచారం జరుగడంతో ఆలయం ఎదుట భక్తులు బారులు తీరారు. విగ్రహానికి పాలు తాగించేందుకు పోటీ పడ్డారు.

  First published:

  Tags: Adilabad, Devotional, MILK

  ఉత్తమ కథలు