Shocking: ల్యాప్‌టాప్‌లో కొడుకు చేసిన పని చూసి ఆందోళ చెందిన తల్లి.. దానిపై కొడుకుని ప్రశ్నిస్తే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఇటీవలి కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు (Mobile Phones and Laptops) ఎక్కువగా చూడటం గమనిస్తూనే ఉన్నాం. అయితే పిల్లలు ఎక్కువగా వాటితోనే గడపటంతో బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండటం లేదు.

  • Share this:
    ఇటీవలి కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు (Mobile Phones and Laptops) ఎక్కువగా చూడటం గమనిస్తూనే ఉన్నాం. అయితే పిల్లలు ఎక్కువగా వాటితోనే గడపటంతో బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండటం లేదు. పిల్లలు స్నేహితులతో ఎక్కువగా మాట్లాడటం, ఆడుకోవడం కూడా క్రమంగా తగ్గిపోతుంది. తల్లిదండ్రులతో కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ.. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే గడిపేస్తున్నారు. అయితే ఓ మహిళ తన కొడుకు ల్యాప్‌టాప్‌లో పొందుపరిచిన వివరాలను చూసి షాక్‌కు గురైంది. పేరెంటింగ్ అడ్వైజరీ కాలమ్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. అంతేకాకుండా నిపుణుల నుంచి సలహా కూడా కోరింది. ఈ ఘటన అమెరికాలో (USA) చోటుచేసుకుంది.

    ‘నా కొడుకుకు 14 ఏళ్లు (14 years old boy).. అతడి పేరు జాక్ (Jack). నా కొడుకు అతని సొంత ల్యాప్‌టాప్ ఇవ్వను. అతను తన సొంత పని కోసం మా ల్యాప్‌ట్యాప్ వాడతారు. అందువల్ల అతను ల్యాప్‌టాప్‌లో అతడు ఏమి చేస్తాడో ఎల్లప్పుడూ గమనించడానికి అవకాశం ఉంటుంది. కానీ నా కొడుకు చాలా తెలివైనవాడు. అతడు ఎవరితోనే బహిరంగంగా మాట్లాడడు. అయితే ఒక రోజు నేను అతని ఫోల్డర్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్సెల్ షీట్ (Excel sheet) గమనించాను. నేను ఆ షీట్ గమనించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఒకరకంగా వింతగా అనిపించింది.

    Gold Investments: పండుగ సీజన్‌లో బంగారం ఏ రూపంలో కొనాలి? ఫిజికల్ గోల్డ్, డిజిటల్‌ గోల్డ్, ఈటీఎఫ్‌ గోల్డ్‌లో ఏది బెస్ట్ ఆప్షన్?

    అందులో జాక్.. తన క్లాస్‌మేట్స్ అందరి పేర్ల జాబితాను రూపొందించాడు. ఈ పేర్ల పక్కన కొన్ని తేదీలను పేర్కొని.. వాటికి సంబంధించిన కొన్ని విషయాలను రాశాడు. అందులో ఓ అబ్బాయి పేరు పక్కన.. అవుగా ఉన్న వ్యక్తుల జోక్స్ చూసి అతడు నవ్వుతాడు అని రాసి ఉంది. దీంతో నేను షాక్ తిన్నాను. ఈ షీట్ గురించి జాక్‌ను అడిగినప్పుడు.. అతని సమాధానం చెప్పడానికి నిరాకరించాడు’అని మహిళ పేర్కొంది. ఈ విధంగా తన కొడుకు పిల్లలను ఎంచుకుని స్నేహం చేయడం సరైనదా..? లేదా..? అని మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.

    Sad: ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు.. కలిసి ఉంటూనే మనసులో ఎంత పగ.. ఇంటర్నెట్‌లో వెతికి మరి..

    దీనిపై స్పందించిన ఓ నిపుణుడు.. మహిళ కొడుకు ఈ విధంగా జాబితా రూపొందించడం ఆందోళన కలిగించే అంశం అని అన్నారు. ఈ వయసులో పిల్లలు సరదాగా ఉండాల్సి ఉంటుందన్నారు. స్నేహితుల ప్రవర్తన గురించి డేటాను రూపొందించాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు తల్లి ప్రశ్నించినప్పుడు అతడు అబద్దం చెప్పాడు. అందుకే అతడిని థెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. 14 ఏళ్ల వయసులో బాలుడు అలా ప్రవర్తించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.
    Published by:Sumanth Kanukula
    First published: