Jumping from Flyover: ‘నాకు బతకడం ఇష్టం లేదు.. చచ్చిపోతా’ అని ఫ్లైఓవర్ ఎక్కాడు.. చివరికి ఏం జరిగిందంటే..

ఫ్లై ఓవర్‌పైకి ఎక్కిన జగత్ సింగ్ బిస్త్‌

మనిషిలో రోజురోజుకూ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. మారిన జీవన విధానం, కుటుంబపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆలుమగల మధ్య గొడవలు.. ఇలా కారణం ఏదైనప్పటికీ క్షణికావేశంలో ఆత్మహత్య ఆలోచన చేస్తూ.. కొందరు ఆ ఆలోచనను నిజం చేస్తూ జీవితాలను అర్థాంతరంగా ముగించేస్తున్నారు.

  • Share this:
    న్యూఢిల్లీ: మనిషిలో రోజురోజుకూ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. మారిన జీవన విధానం, కుటుంబపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆలుమగల మధ్య గొడవలు.. ఇలా కారణం ఏదైనప్పటికీ క్షణికావేశంలో ఆత్మహత్య ఆలోచన చేస్తూ.. కొందరు ఆ ఆలోచనను నిజం చేస్తూ జీవితాలను అర్థాంతరంగా ముగించేస్తున్నారు. అలా ఆత్మహత్య ఆలోచన చేసి ఢిల్లీకి చెందిన ఓ 42 ఏళ్ల వ్యక్తి చనిపోవడానికి ఫ్లైఓవర్ ఎక్కాడు. పై నుంచి దూకి చనిపోవాలనుకున్నాడు. సెప్టెంబర్ 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

    ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఆండ్రూ గంజ్ ఫ్లైఓవర్‌పై నుంచి సెప్టెంబర్ 12న సాయంత్రం 6 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ దగ్గరకు వచ్చాడు. ఫ్లై ఓవర్ పైకి ఎక్కాడు. అతనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తికి కిందకు దిగమని చెప్పారు. అయితే.. తాను దిగనని.. తనకు ఇకపై బతకాలని లేదని ఆ వ్యక్తి గట్టిగా కేకలేశాడు.



    అయితే.. పోలీసులు ముందు జాగ్రత్తగా పొరపాటున దూకుతాడేమోనని కింద నెట్ తీసుకొచ్చి పట్టుకున్నారు. అయితే.. ఎట్టకేలకు పోలీసులు మాటలతోనే ఆ వ్యక్తికి ప్రాణం విలువ తెలియజేసి ఎట్టకేలకు దిగి వచ్చేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    చనిపోవాలని ఫ్లై ఓవర్ ఎక్కిన ఆ వ్యక్తి పేరు జగత్ సింగ్ బిస్త్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. ఢిల్లీలోని హుజ్ ఖాస్ ప్రాంతంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడని, కుటుంబపరమైన ఇబ్బందులు.. ఆర్థిక సమస్యల కారణంగా చనిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published: