హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Pink Diamond: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !

Pink Diamond: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !

300 ఏళ్ల తర్వాత దొరికిన  అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మూర్ఛపోతారు.. ఎక్కడ దొరికిందంటే !

300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మూర్ఛపోతారు.. ఎక్కడ దొరికిందంటే !

ఆఫ్రికాలోని అంగోలా (Angola) దేశంలో ఏకంగా 170 క్యారెట్ల పింక్(Pink) డైమండ్‌ దొరికింది. ఈ స్వచ్ఛమైన పింక్ డైమండ్ ఇప్పటి వరకు దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. గత మూడు వందల సంవత్సరాల్లో ఇంత పెద్ద డైమండ్ దొరకడం ఇదే తొలిసారి.

ఇంకా చదవండి ...

తెలుపు వజ్రాల (White Diamonds) కంటే పింక్ కలర్ వజ్రాలు (Pink Diamonds) 20 రెట్లు ఖరీదైనవిగా చెబుతారు. కేవలం ఒకే ఒక్క క్యారెట్ (Carat) పింక్ డైమండ్ కోట్ల రూపాయలు పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఎంత విలువున్న ఇవి చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతాయి. అయితే ఇప్పుడు ఏకంగా 170 క్యారెట్ల పింక్ డైమండ్‌ దొరికింది. ఆఫ్రికాలోని అంగోలా (Angola) దేశంలోని మైనర్లు ఈ అత్యంత అరుదైన ప్యూర్ పింక్ డైమండ్ కనుగొన్నారు. ఈ పింక్ డైమండ్ దొరికినట్లు బుధవారం రోజు ఆస్ట్రేలియన్(Australia) సైట్ ఆపరేటర్ వెల్లడించారు. ఈ స్వచ్ఛమైన పింక్ డైమండ్ ఇప్పటి వరకు దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. గత మూడు వందల సంవత్సరాల్లో ఇంత పెద్ద డైమండ్ దొరకడం ఇదే తొలిసారి.

ఆఫ్రికా(Africa) ఖండం, అంగోలా దేశం, లుండా నార్టే ప్రాంతంలోని లులో అల్లువయల్ (Lulo alluvial) వజ్రాల గనిలో ఈ డైమండ్ దొరికింది. దీనికి "లులో రోజ్" అని పేరు పెట్టారు. ఈ వజ్రం దొరికినట్లు ఆ వజ్రాల గని పెట్టుబడిదారులు, ప్రభుత్వ రంగ డైమండ్ మైనర్ ఎండియామా, రోసాస్ & పెటలాస్‌లతో కలిసి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వజ్రాల గనిలోనే దేశంలోని మిగతా ప్రాంతాల కంటే అధికంగా డైమండ్స్ లభిస్తాయి. జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా(America) చెప్పిన ప్రకారం, అంగోలా గనులు ప్రపంచంలోనే మొదటి పది వజ్రాల ఉత్పత్తిదారులలో ఒకటి. సాధారణంగా 10,000 తెల్ల వజ్రాలు దొరికితే అందులో కేవలం కొన్ని మాత్రమే రంగు వజ్రాలు దొరుకుతాయి. ఇక పింక్ డైమండ్ అనేది లక్షల్లో ఒకటిగా లభిస్తుంది. అందులోనూ ఇదంటే ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే వీటికంత ధర పలుకుతుంది. తాజాగా దొరికిన డైమండ్ తరుగు పోనూ అది రూ.వేల కోట్లలో ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఇదీ చదవండి:  Russia-China: అమెరికాకు చెక్ పెట్టనున్నరష్యా- చైనా.. వార్ గేమ్స్ తో భారీ ప్రదర్శనకు శ్రీకారం


లులో గనిలో ఇప్పటికే అంగోలాలో రెండు అతిపెద్ద వజ్రాలు లభ్యమయ్యాయి. ఇందులో 404-క్యారెట్ క్లియర్ డైమండ్ కూడా ఉంది. పింక్ రత్నం ఐదవ అతిపెద్ద వజ్రం గనిలో లభ్యమైంది. ఇక్కడ 100 క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువ 27 వజ్రాలు లభించాయి. ఆస్ట్రేలియాలో ఉన్న లుకాపా ప్రకారం. పింక్ డైమండ్‌ను అంగోలాన్ స్టేట్ డైమండ్ మార్కెటింగ్ కంపెనీ సోడియం అంతర్జాతీయ టెండర్ ద్వారా విక్రయించనుంది.

అంగోలా గనులు ప్రపంచంలోని వజ్రాల టాప్ 10 ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచాయి. అరుదైన, స్వచ్ఛమైన వజ్రాలలో ఒకటైన టైప్ IIa డైమండ్ కనుగొనడం పట్ల అంగోలాన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా ఈ గనిలో భాగస్వామిగా ఉంది. లులో నుంచి స్వాధీనం చేసుకున్న ఈ అద్భుతమైన పింక్ డైమండ్ అంగోలాను వజ్రాల మైనింగ్‌లో ఒక ముఖ్యమైన ప్లేయర్ గా నిలుపోతోందని.. తమ వజ్రాల మైనింగ్ పరిశ్రమలో నిబద్ధత, పెట్టుబడికి మంచి ప్రతిఫలం తెచ్చిపెడుతుందని అంగోలా ఖనిజ మంత్రి డయామాంటినో అజెవెడో పేర్కొన్నారు.

First published:

Tags: Africa, Australia, Diamonds, Gold Mines

ఉత్తమ కథలు