దీపికా పదుకొనే- రణ్‌వీర్ పెళ్లి డేట్ వెనక రహస్యం ఇదేనట!

కలిసి నటించిన మొదటి సినిమా గుర్తుగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న జంట... ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తిచేసుకుంటున్న ‘రామ్‌లీలా’!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 22, 2018, 5:59 PM IST
దీపికా పదుకొనే- రణ్‌వీర్ పెళ్లి డేట్ వెనక రహస్యం ఇదేనట!
దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్
  • Share this:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ జంట వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 14, 15 తేదీల్లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు. అయితే వివాహ ముహుర్తం గానీ, పెళ్లి జరిగే వేదిక గురించి గానీ శుభలేఖలో ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ఈ తేదీల్లోనే దీప్‌వీర్ పెళ్లి ఎందుకు చేసుకోబోతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రణ్‌వీర్, దీపికా ఇద్దరూ హిందూ సంప్రదాయాన్ని గౌరవించేవారే.

హిందూ పంచాంగం ప్రకారం నవంబర్ నెలలో, ముఖ్యంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రోజుల్లో మంచి ముహుర్తాలు లేవు. దీపావళి సీజన్‌లో పెళ్లిళ్లు జరుగుతాయి కానీ ఈ ఏడాది గురు మూఢం కారణంగా పెళ్లిళ్లకు, శుభకార్యాలకు సరిపడే ముహుర్తాలు లేవు. అయినా ఈ సమయంలో వీరిద్దరూ కల్యాణం చేసుకోవడానికి రెఢీ అవుతుండడానికి కారణం... వాళ్లని కలిపిన మొదటి సినిమా ‘రామ్‌లీలా’ గుర్తుగానే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. 2013లో నవంబర్ 15న ‘గోలియోంకీ రాసలీలా రామ్‌లీలా’ సినిమా విడుదలయ్యింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దీపికా- రణ్‌వీర్‌ల మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచాయి. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా షూటిం‌గ్‌లోనే వీరి మధ్య ప్రేమపుట్టింది.

అందుకు సాక్ష్యంగానే ఈ తేదీనే వివాహ ముహుర్తంగా ఫిక్స్ చేసుకుందట ఈ జంట. దీపికా పదుకునే కన్నడ అమ్మాయి కావడంతో దక్షిణ భారతీయ సంప్రదాయంలో, రణ్‌వీర్ సింగ్‌ కుటుంబం తరుపున సింధీ సంప్రదాయంలోనూ పెళ్లి జరగనుంది.
Published by: Ramu Chinthakindhi
First published: October 22, 2018, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading