హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

289 గ్రాముల స్ట్రాబెర్రీ .. పండించిన రైతుకు దక్కిన ప్రతిఫలం ఏంటో తెలుసా

289 గ్రాముల స్ట్రాబెర్రీ .. పండించిన రైతుకు దక్కిన ప్రతిఫలం ఏంటో తెలుసా

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Guinness Book of Records: ఇజ్రాయేల్‌కి చెందిన ఓ రైతు అద్భుతం సృష్టించాడు. తన వ్యవసాయ క్షేత్రంలో అతి పెద్ద స్ట్రాబెర్రీ ఫ్రూట్‌ని సాగు చేసి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డు సాధించాడు.

చూడటానికి ముద్దుగా చిన్నగా ఉండే స్ట్రాబెర్రీ strawberry ఫ్రూట్‌ కూడా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డుGuinness World Record లోకి ఎక్కింది. ద్రాక్ష పండు కంటే కాస్త పెద్ద సైజులో ఉండే స్ట్రాబెర్రీ ఏకంగా పనస కాయల అంత పెద్దగా పెరగడంతో రైతు ఆశ్చర్యపోయి ప్రదర్శనకు ఉంచాడు. అంతే ఆ దెబ్బతో గిన్నీస్‌ బుక్‌ ప్రతినిధులు గుర్తించి ఇంత పెద్ద స్ట్రాబెర్రి ఫ్రూటా అంటూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోకెల్లా ఇదే అతిపెద్ద స్ట్రాబెర్రీ ఫ్రూట్ అంటూ గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్ అందజేశారు. ఇజ్రాయేల్‌కి చెందిన రైతు ట్జచీ ఎరిల్(Tzachi Ariel) గత కొంతకాలంగా సెంట్రల్ ఇజ్రాయేల్‌(Central Israel)లోని కడిమా గ్రామం(Kadima village)లో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం మాదిరిగానే గతేడాది స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ సాగు చేశాడు. తన వ్యవసాయక్షేత్రం అతి పెద్ద ఫ్రూట్‌ దిగుబడి కావడంతో ఆశ్చర్యపోయాడు. గతేడాది ఫిబ్రవరి 12వ తేదిన ఇది జరిగింది. ఆ పండు సైజు 289గ్రాముల (289-Gram strawberry) బరువు ఉండటంతో వెంటనే గిన్నీస్‌ రికార్డ్‌ ప్రతినిధులకు విషయాన్ని చేరవేశాడు. ఇంత వరకు దానిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో యధావిధిగా వ్యవసాయం చేస్తున్నాడు. తాజాగా గిన్నీస్‌ వరల్డ్‌ ప్రతినిధులు అతి పెద్ద స్ట్రాబెర్రీ ఫ్రూట్‌పై రీసెర్చ్ చేయడమే కాకుండా ఇంత సైజులో బరువైన స్ట్రాబెర్రీ గతంలో ఎక్కడైనా చెట్టుకు కాసిందా అని ఆరా తీశారు. ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకూ ఇంత పెద్ద స్ట్రాబెర్రీ కాయలేదని తేలడంతో ట్జచీ ఎరియల్‌కు రెండు వారాల క్రితం ఫోన్‌ చేసి గుడ్ న్యూస్ చెప్పారు.

భారీ సైజు స్ట్రాబెర్రీనా ..

సాధారణంగా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతు..ఇంత పెద్ద సైతు స్ట్రాబెర్రీకి కచ్చితంగా గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంటుందని భావించే వారికి సమాచారం చేరవేసినట్లుగా చెప్పాడు. అయితే ఈ శుభవార్త వినడానికి సుమారు ఏడాది కాలం ఎదురుచూశామన్నాడు. తమ తోటలో కాచిన స్ట్రాబెర్రీ ఫ్రూట్‌ ద్వారా గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు.

ఫ్రూట్‌కి గిన్నీస్‌ రికార్డులో చోటు..

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత గింజలు లేని పండ్లు, ముళ్లు లేని కాయలు, అలాగే రకరకాల పూలు. పండ్లను అతి తక్కువ సమయంలో సాగు చేస్తూ వస్తున్నారు రైతులు. ఆధునిక సాగు యంత్రాలు, అరుదైన రసాయనాలు, ఎరువులతో పాటు వ్యవసాయ కమర్షియల్ క్రాప్స్ సాగు చేసేందుకు నిపుణుల సూచనలతో ఎన్నో అద్బుతమైన పండ్లు, పూలు ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. కానీ ఇజ్రాయేల్‌లో స్ట్రాబెర్రీ పండించిన రైతు మాత్రం సాధారణ వ్యవసాయ పద్దతిలోనే ఇంత పెద్ద పండును తన తోటలో పండించి అందరి దృష్టిలో పడ్డాడు.

First published:

Tags: Israel

ఉత్తమ కథలు