Video: పెళ్లికొచ్చిన మాజీ ప్రియుడు.. వధువును చూస్తూ ఏం చేశాడంటే!

పెళ్లికొచ్చిన మాజీ ప్రియుడు (image credit - youtube)

Viral Video: అతను పెళ్లికి వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ వచ్చాడు. అతను ఏం చేస్తాడన్నది అందరికీ సస్పెన్స్. మరి అతను పెళ్లికి వస్తూ ఆమెను చూస్తూ... ఏం చేశాడో తెలుసా? సెన్సేషనల్ వీడియో చూడండి.

 • Share this:
  Viral Video: అన్ని పెళ్లిళ్లూ ఆనందంగానే జరగవు. కొన్ని పైకి ఆనందాలతో... లోలోపల ఆవేదనలతో జరుగుతాయి. ముఖ్యంగా ప్రేమికుల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కాలేజీ రోజుల్లో ఆకర్షణతో ప్రేమలో పడతారు. పీకల్లోతు ప్రేమించుకుంటారు. ఎంతలా అంటే ఒకర్ని విడిచి మరొకరు బతకలేనంతలా. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి పెద్దల్ని ఒప్పించడంలో ఫెయిలవుతుంటారు (Love Fail). ఆ క్రమంలో... అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి వెంటనే వేరే సంబంధం చూసేస్తారు. ఆ పెళ్లిని ఆపే పరిస్థితి లేక... అక్కడ ప్రియుడు (Lover), ఇక్కడ ప్రియురాలూ... మొనం వహిస్తారు. చివరకు పెళ్లైపోతుంది. ఇలాంటి కథలు ఎన్నో. చాలా మంది జీవితాలపై ఇవి రకరకాల ప్రభావాలు చూపిస్తాయి.

  స్థానిక కథలో ఏమైందంటే... వధువు ఓ యువకుణ్ని పెళ్లి చేసుకుంది (Bride wedding). ఆ పెళ్లికి... అటూ ఇటూ రెండువైపుల బంధువులూ వచ్చారు. అందరూ ఆనందంగా ఉన్న సందర్భం. బంధువులు వధూవరులను కలిసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని పర్సనల్‌గా విషెస్ చెబుతున్నారు. అలాంటి సమయంలో... అక్కడకు ఎంట్రీ ఇచ్చాడు వధువు బాయ్ ఫ్రెండ్ (ex-boyfriend). తాను చేసుకోవాల్సిన అమ్మాయిని మరో వ్యక్తి పెళ్లి చేసుకున్నాడనే కోపం అతనిలో చాలా ఉంది. పైకి మాత్రం నవ్వుతూ వచ్చి... వరుడికి విషెస్ చెప్పాడు. ఆ తర్వాత ఆలింగనం చేసుకున్నాడు.

  అలా ఆలింగనం చేసుకుంటూ వధువువైపు కోపంగా చూశాడు. ఆ క్షణం అతనిలో కోపం, ఆవేదన, తన ప్రేమ తనకు కాకుండా పోతోందనే బాధ అన్నీ కనిపించాయి. అతని కళ్లు చమర్చాయి. అప్పటివరకూ కళ్లను పైకి ఎత్తి ఉంచిన వధువు... అతను అలా చూడటంతో... కళ్లతో నేలవైపు చూస్తూ ఉండిపోయింది. బహుశా పెద్దల ఒత్తిడితో ఆమె ఆ పెళ్లి చేసుకొని ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వధువును అలా చూసిన మాజీ బాయ్ ఫ్రెండ్... ఇక చేసేదేమీ లేదు అన్నట్లుగా నిరాశతో కూడిన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టుకొని... తిరిగి చిన్నగా నకిలీ నవ్వు ఫేస్ పెట్టుకొని అక్కడి నుచి వెళ్లిపోయాడు. పైకి అలా ఉన్నా... లోలోపల అతని బాధ అతనికే తెలుస్తుంది అని నెటిజన్లు అంటున్నారు.

  ఆ వీడియోని ఇక్కడ చూడండి.
  ఇది కూడా చదవండి: Video: పెళ్లి కాన్సిల్ అంటూ అలిగిన వధువు.. కారణం తెలుసా?

  జారా క్వీన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ (Zara Queen's Instagram account)లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి స్పందన బాగుంది. చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. తమకూ ఇలా జరిగిందని కొందరు, ప్రేమించే వాళ్లకే ఆ ఫీల్ తెలుస్తుందని మరికొందరు అంటున్నారు (emotional comments). ఇదే కాదు చాలా పెళ్లిళ్లలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కొందరైతే... తమకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదనే తీవ్ర ఆలోచనతో హింసకు పాల్పడుతుంటారు. ఇక్కడ మాత్రం మాజీ ప్రియుడు... సైలెంట్‌గా వెళ్లిపోవడం నెటిజన్ల హృదయాల్ని టచ్ చేసింది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: