ఇంగ్లీష్ సినిమాల్లో ఆ దృశ్యాలు కట్.. ఎందుకో తెలుసా..

Hollywood News: ఆ సీన్లు కనుమరుగు కానున్నాయా? సాధారణ సినిమాల్లో ఆ దృశ్యాలు ఇక కనిపించవా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దానికి కారణం ఏంటంటే.. #MeToo ప్రభావమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

news18-telugu
Updated: July 2, 2019, 11:39 AM IST
ఇంగ్లీష్ సినిమాల్లో ఆ దృశ్యాలు కట్.. ఎందుకో తెలుసా..
40 శాతం మంది పురుషులు పైన ఉండి శృంగారం చేయడాన్ని ఇష్టపడితే, 22.6 శాతం మంది మహిళలు పైన ఉండి సెక్స్ చేస్తే బాగుంటుందని చెప్పారు.
  • Share this:
హాలీవుడ్ సినిమాల్లో శృంగార దృశ్యాలు కామన్. నిజంగా చెప్పాలంటే.. ఆ సన్నివేశాలు లేని సినిమా ఉండదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. హారర్ సినిమా అయినా, యాక్షన్ సినిమా అయినా శృంగారం పండాల్సిందే. గత దశాబ్ద కాలంలో సెక్స్ దృశ్యాలు కామన్ అయిపోయాయి. ఆ దృశ్యాలు ఉంటేనే ప్రేక్షకులకు కూడా కాస్త సంతృప్తి. ఆ సీన్లు లేకపోతే.. అయ్యో సినిమా వేస్టే అనేంతగా వాటికి అలవాటు పడిపోయారు హలీవుడ్ ప్రేక్షకులు. అయితే, ఇప్పుడు ఆ సీన్లు కనుమరుగు కానున్నాయా? సాధారణ సినిమాల్లో ఆ దృశ్యాలు ఇక కనిపించవా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దానికి కారణం ఏంటంటే.. #MeToo ప్రభావమే అంటున్నారు సినీ విశ్లేషకులు. పలు సినిమాల ఆహ్లాదాన్ని కూడా దెబ్బతీస్తున్నాయన్న కారణంతోనూ వాటిని ఉంచేందుకు దర్శకులు ఆసక్తి చూపడం లేదట.

యాక్షన్ సినిమాల్లో ఈ దృశ్యాలు కాస్త ఇబ్బందిగా మారాయని, కుటుంబ కథా చిత్రాల్లో వీటిని ఉంచడం వల్ల నెగెటివ్ ప్రభావం పడుతోందన్న ఉద్దేశంతో వాటికి కట్ చెప్పేస్తున్నారట. సెక్స్ సీన్లు ఉన్న సినిమాలకు హాలీవుడ్‌లో ‘ఆర్’ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సినిమాలకు చిన్నపిల్లలు రావడానికి అవకాశం లేదు. దానివల్ల రెవెన్యూపై ప్రభావం పడుతోందని ఆలోచించిన దర్శక నిర్మాతలు ఆ సీన్లకు దూరంగా ఉంటున్నారు.

మరోవైపు, మీటూ ప్రభావం కూడా హాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. హీరోయిన్లు, సైడ్ కేరెక్టర్ చేసే నటీమణులకు ఎదురయ్యే లైంగిక వేధింపులు సినిమాపై, సినిమా రెవెన్యూపై దెబ్బ పడుతుందన్న కారణంతో ఎందుకొచ్చిన గొడవ అనుకొని ఆ సీన్లకు దూరంగా ఉంటోంది హాలీవుడ్. ఏదేమైనా ఆ సీన్ల కోసమే హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఇది కాస్త చేదు వార్తే.
First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading