ఏనుగు (Elephant). వాటికి కోపం వస్తే అంతే ఎలాంటి జంతువైనా, ఎంతటి వాళ్లైనా బెదిరిపోవాల్సిందే. పెద్దపెద్ద చెట్లు సైతం అలవోకగా పీకి పడేస్తాయి. అదే ఏనుగ చేసే చిన్న అల్లరి పనులు(Silly things) చూస్తుంటే ముచ్చటేస్తుంది. మనం చేసే పొరపాట్లతో వాటి ఆగ్రహానికి కారణమైన.. ఏనుగులు కూడా మనుషులతో స్నేహంగానే ఉంటాయి. మన దగ్గరైతే ఎక్కువగా కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ ఏనుగులు ఊరికి కనీసం నాలుగైదు ఉంటాయి. వాటిని అక్కడ కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటారు. వాటికేదైనా అయితే తట్టుకోలేరు. చాలామంది వాటిని పెంచుకుంటారు. పెళ్లిళ్లకు ఊరేగింపుంగా కూడా వాటిని వాడుతారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో (Social media) ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో ఫన్నీ వీడియోలు (Funny videos) కూడా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కాస్త విభిన్నం.. ఆ ఏనుగు చేసిన పని నవ్వులు పూయిస్తుంది.
ఏనుగుల అల్లరి చేష్టలను.. గున్న ఏనుగుల మారాం వీడియోలు చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు… ఏనుగుల ఫన్నీ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటివి చూస్తే చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చిరునవ్వులు చిందించాల్సిందే. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయి, అబ్బాయి.. తమను వీడియో (video) తీయమని తమతో ఉన్న పెద్ద ఏనుగుకు చెప్పి.. ఫోన్ తన తొండంకు ఇచ్చారు. అనంతరం వీడియోకు అనుగుణంగా ఫోటో (Photo), వీడియోలకు ఫోజిచ్చారు. అంతేకాదు.. అమ్మాయిని అబ్బాయి ఎత్తుకుని తిప్పే సమయంలో ఆ ఏనుగు కూడా చలాకిగా ఫోన్‌ను కూడా రౌండ్ (Round) గా తిప్పెసింది. ఇక వీడియో తీయడం పూర్తయ్యక.. దానిని చూసి ఆ ఇద్దరూ షాక్ అయ్యారు.
View this post on Instagram
తమను వీడియో తీయాల్సింది పోయి.. ఆ ఏనుగు తనకు తానే సెల్ఫీ వీడియో (Selfie video) తీసుకుంది. అందులో ఏనుగు ఫేస్ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో(Social media) చక్కర్లు కొడుతుంది. వీడియో తీయడానికి బదులుగా ఏనుగు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో నెటిజన్లు (netizens) సోషల్‌మీడియాలో చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Wan Mai has a great fun with the broken water pipe. She is very happy and more playful with her privilege fountain.
How You Can Help Elephants:https://t.co/eEJN3G69HV pic.twitter.com/mwtGmwRI2z
— Elephant Nature Park (@ElephantNatureP) July 1, 2021
మరో వీడియోలో..
ఏనుగులకు నీళ్లంటే మహా ఇష్టం. అలా ఓ పిల్ల ఏనుగుకు నీళ్లు కంటపడ్డాయి. ఇంకేముంది జలకాలాటలో ఆ ఏనుగు మునిగి తేలింది. థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్కులో వాటర్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో ఆ పైపు నుంచి నీళ్లు ఉబిచి వచ్చాయి. పైకి ఉబికి వస్తున్న నీటిలో జలకాలాట ఆడి ఏనుగు ఎంజాయ్ చేసింది. ఇక ఆ పిల్ల ఏనుగు తల్లి పక్కనే ఉండి బిడ్డ చేస్తున్న ఎంజాయ్‌ను చూసి ముచ్చట పడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cute selfie, Elephant, Social Media, Video, Viral Videos