HOME »NEWS »TRENDING »the ear phone took her life people were shouting but she died watch cctv footage video nk

ప్రాణాలు తీసిన హెడ్‌ఫోన్స్... పట్టాలు దాటుతూ బలైపోయిన మహిళ... CCTV వీడియో...

ప్రాణాలు తీసిన హెడ్‌ఫోన్స్... పట్టాలు దాటుతూ బలైపోయిన మహిళ... CCTV వీడియో...
ప్రాణాలు తీసిన హెడ్‌ఫోన్స్... పట్టాలు దాటుతూ బలైపోయిన మహిళ... CCTV వీడియో... (image credit - twitter)

ఫోన్ మాట్లాడుతూనో, హెడ్ ఫోన్ పెట్టుకొనో డ్రైవింగ్ చేయవద్దని పోలీసులు చెబుతుంటారు... అది నిజమే... ఈ మహిళ చేసిన తప్పు మనం జీవితంలో చెయ్యకూడదు.

  • Share this:
    మనం ఇప్పటివరకూ చాలా సీసీటీవీ ఫుటేజ్‌లు చూసి ఉంటాం. ఇది మాత్రం మనకు షాక్ ఇస్తుంది. ఇలా జరగకపోయి ఉంటే బాగుండని అనుకుంటాం కానీ... ఎవరు చేసిన తప్పులకు వారే బాధ్యులు అనేలా జరిగిందీ ఘటన. ఇంతకుముందు ఓ యువకుడు కూడా ఇదే తప్పు చేసాడు. ట్రైన్ హారన్ వినకుండా... ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటుంటే... ట్రైన్ వచ్చి గుద్దేశించి. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. అలాంటి ఘటనే మరొకటి ఇప్పుడు జరిగింది. అది మధ్యప్రదేశ్.. హోషంగాబాద్. అక్కడి ఓ రైల్వే క్రాస్ దగ్గర... రైలు వచ్చే వేళైంది. పట్టాలకు అటువైపు, ఇటువైపు ఉన్న ప్రయాణికులు... ట్రైన్ ఎప్పుడు వచ్చి, వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇంకా రైలు రాలేదు.

    ఇంతలో ఓ మహిళ... ఏవీ పట్టించుకోకుండా పట్టాలు దాటడం మొదలుపెట్టింది. ఆమె భుజానికి ఓ బ్యాగ్, చెవులకు ఇయర్‌ఫోన్స్ ఉన్నాయి. అందువల్ల ఆమెకు బయటివైపు ఏ సౌండ్లూ వినిపించట్లేదు. అక్కడ క్రాస్ రోడ్డులో మూడు రైలు పట్టాలు ఉన్నాయి. మొదటి రెండూ బాగానే దాటింది. అప్పుడు ఏ రైలూ రాలేదు. కనీసం మూడో ట్రాక్ దాటేటప్పుడైనా... రైలు వస్తుందేమో అని అటూ ఇటూ చూసుకోవాలి కదా. కానీ ఏమాత్రం చూసుకోలేదు. ఆమె పట్టాలు దాటుతుండగా... ట్రైన్ రావడం మొదలుపెట్టింది. ట్రైన్ డ్రైవర్లు హారన్ కొట్టారు కూడా. అయినా ఆమె పట్టించుకోకుండా... పట్టాలపై నుంచి వెళ్లసాగింది. స్థానికులు కూడా ఆమెకు చెబుతున్నా ఆమె పట్టించుకోలేదు. కేకలు వేస్తున్నా వినిపించుకోలేదు. ఇంతలో రైలు వచ్చేసింది. అప్పుడు చూసిన ఆమె... వేగంగా పట్టాల నుంచి పక్కకు వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే ట్రైన్ వచ్చేసి... బలంగా ఢీకొట్టడంతో... స్పాట్‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూడండి.




    ఇది కూడా చదవండి: Weekly Horoscope: వారఫలాలు... జనవరి 17 నుంచి జనవరి 23 వరకు రాశి ఫలాలు

    మనలో చాలా మంది రైలు పట్టాలు దాటేటప్పుడు "ఏమవుద్ది... రైలు రాదులే... ఆ లోపే దాటేస్తా... వీళ్లందరిలాగా వెయిట్ చెయ్యడం నా వల్ల కాదు" అనుకుంటారు. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు కదా. కాసేపు ఆగితే తప్పేమీ లేదు. కంగారుపడితే ఇలాంటిదేమైనా జరిగితే... కుటుంబ సభ్యులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. దయచేసి రోడ్లు, బస్సులు, రైళ్లలో వెళ్లేటప్పుడు ఇయర్‌ఫోన్స్ వాడకండి అంటున్నారు అధికారులు. తప్పనిసరై వాడాల్సి వస్తే... బయటి సౌండ్లు కూడా వినిపించేంత తక్కువ వాల్యూమ్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:January 17, 2021, 07:12 IST