Home /News /trending /

THE DAUGHTER OF A VEGETABLE SELLER IN INDORE MADHYA PRADESH HAS SHOWN AMAZING TALENT IN THE CIVIL JUDGE RECRUITMENT EXAM PRV GH

Daughter of Vegetable Vendor: సివిల్ జడ్జి రిక్రూట్‌మెంట్ పరీక్షలో కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె అద్భుత ప్రతిభ..

తల్లిదండ్రులతో అంకిత (Phot: ANI/Twitter)

తల్లిదండ్రులతో అంకిత (Phot: ANI/Twitter)

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి కుమార్తె అంకిత (Ankita) సివిల్ జడ్జి రిక్రూట్‌మెంట్ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచింది. సామాన్యులకు ఆదర్శంగా నిలిచింది.

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఇండోర్‌ (Indore)లో కూరగాయలు విక్రయిస్తూ (Vegetable Vendor) కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి కుమార్తె అంకిత (Ankita) సివిల్ జడ్జి రిక్రూట్‌మెంట్ పరీక్షలో(Civil Judge Recruitment Exam) ఉత్తీర్ణత సాధించింది. ఈ పరీక్షలో ఆమె ఎస్సీ కేటగిరి లో 5వ ర్యాంక్ (rank) సాధించింది. ఆమె తండ్రి అశోక్ ముసాఖేడి ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తున్నారని ఓ వార్తా సంస్థ తెలిపింది. చదువు పూర్తయ్యాక అంకిత రోజూ తన తండ్రి కూరగాయల దుకాణంలో సహాయం చేసేది. లాక్‌డౌన్ సమయంలో చదువుకోవడానికి తగినంత సమయం దొరికిందని ఆమె పేర్కొంది. చాలా వరకు ఆమె YouTubeని వినియోగించుకున్నట్లు తెలిపింది. అంకిత చాలా వరకు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల ద్వారా చదివింది. చదువుపై (Education) దృష్టి పెట్టాలని తల్లిదండ్రులే ఆమెకు చెప్పారు. ఆమె డాక్టర్ కావాలనుకున్న ప్పటికీ ఖరీదైన అడ్మిషన్ ఫీజులు ఆమెను సివిల్ జడ్జి పరీక్షకు సిద్ధం అయ్యేలా ప్రేరేపించాయి.

పెళ్లి చేసుకో అన్నారు..

దీనిపై అంకిత మాట్లాడుతూ..‘నేను డాక్టర్ కావాలనుకున్నాను, కానీ వైద్య విద్యకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకు బదులుగా సివిల్ జడ్జి పరీక్షకు (Civil Judge Recruitment Exam) సిద్ధం కావడం ప్రారంభించాను. నేను చాలా వరకు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌పై చదివాను. ప్రత్యేకత ఉన్నప్పటికీ చదువుకోని పిల్లలు, తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది పెళ్లి చేసుకో అన్నారు. కానీ నా తల్లిదండ్రులు నన్ను చదువుపై దృష్టి పెట్టాలని కోరారు.’ అని ఆమె చెప్పింది.

తమ కుమార్తెకు “జీవితంలో సరైన అవకాశం” ఇవ్వాలని కోరుకున్నారని, అందుకే కుమార్తె చదువు కోసం ఆరేళ్లుగా చాలా కష్టపడ్డామని, అంకిత ఎలాంటి సౌకర్యాలు లేకుండా చదివి పరీక్షలో ఉత్తీర్ణత (Pass) సాధించిందని, ఆమెను చూసి గర్విస్తున్నామని అంకిత తల్లిదండ్రులు చెప్పారు. ఎవరూ తమ కూతుళ్లను పెళ్లి చేసుకోమని బలవంతం చేయకూడదు అని చదివించాలని చెబుతున్నారు.

అంకిత తండ్రి అశోక్ నగర్  (Ashok nagar)మాట్లాడుతూ..‘కుటుంబం చాలా కష్టపడి కుమార్తె చదువు కోసం డబ్బును ఆదా చేసింది. ఆనందాన్ని చెప్పడానికి మా దగ్గర మాటలు లేవు. మేము చాలా కష్టపడ్డాము. ప్రజలు కొడుకు, కుమార్తె మధ్య తేడాను చూస్తారు. అలా చేయవద్దని నేను కోరుతున్నాను. కొడుకు కంటే కూతురు మేలు. ఈరోజు అందరూ నన్ను అభినందించడానికి వస్తున్నారు. నాకు ముగ్గురు పిల్లలు, ఒక కొడుకు ఎంబీఏ (MBA) చదివాడు, చిన్న కూతురు పెళ్లి చేసుకొంది. మధ్య కూతురు అంకిత చదివి జడ్జి అయింది. ఆడపిల్లలు కూడా చదువుకోవాలి.’ అని చెప్పారు.

అంకిత తల్లి లక్ష్మి నగర్‌ మాట్లాడుతూ..‘మా కుటుంబం కూరగాయలు అమ్మడం (Vegetable selling) ద్వారా మాత్రమే నడుస్తుంది. మేము కుమార్తె చదువు కోసం డబ్బును కష్టపడి దాచి ఉంచాం. గత 5-6 సంవత్సరాలు మా కుటుంబానికి చాలా కష్టంగా గడిచింది. నా కొడుకులకూ, కూతుళ్లకూ సమాన ప్రాధాన్యం ఇచ్చి చదువు చెప్పించాను.’ అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Entrance exams, Indore, Madhya pradesh, Trending news, Vegetables

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు