షింక్ పగిలిందా... నోప్రాబ్లం... మ్యాగీ నూడుల్స్‌తో రిపేర్... వైరల్ వీడియో...

Maggi Viral Video : పగిలిన వాష్ బేసిన్‌ను మ్యాగీతో రిపేర్ చెయ్యడం ఎప్పుడైనా చూశారా... ఈ స్టోరీ ద్వారా అదెలాగో తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 1:43 PM IST
షింక్ పగిలిందా... నోప్రాబ్లం... మ్యాగీ నూడుల్స్‌తో రిపేర్... వైరల్ వీడియో...
పగిలిన షింక్‌కి మ్యాగీ నూడుల్స్‌తో రిపేర్ (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 1:43 PM IST
సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఇదొకటి. ఇందులో ఓ యువకుడు... పగిలిన వాష్‌బేసిన్‌ను మ్యాగీ నూడుల్స్ వాడి రిపేర్ చేశాడు. అసలిది మన కళ్లతో మనం నమ్మలేని విషయం. మ్యాగీతో ఐదు నిమిషాల్లో బ్రేక్ ఫాస్ట్ రెడీ అవుతుందని మనకు తెలుసుగానీ... అదే మ్యాగీ నూడుల్స్‌తో షింక్‌ను రిపేర్ ఎలా చేస్తారన్నది తెలుసుకోవాల్సిన విషయమే. ఈ వీడియో చూస్తే... కచ్చితంగా మ్యాగీ అనేది బ్రేక్ ఫాస్ట్ కోసమే కాదనీ, ఇంకా చాలా రకాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చనే ఆలోచన మీకు కలిగితే, తప్పేమీ కాదు. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది. అతను రిపేర్ చేసిన విధానం చూస్తే... ఇదెలా సాధ్యమైంది అని మీకు మీరే ప్రశ్నించుకుంటారు.

maggy, washbasin, repair, viral video, maggie, broken washbasin, viral video, viral news, home, viral share, మ్యాగీ, నూడుల్స్, వైరల్ వీడియో, వైరల్ న్యూస్, వాష్ బేసిన్, షింక్, రిపేర్,
పగిలిన షింక్‌కి మ్యాగీ నూడుల్స్‌తో రిపేర్ (Image : Twitter)


ఈ వీడియోలో యువకుడు... ముందుగా పగిలిన తన వాష్ బేసిన్‌ను చూపించాడు. అది అత్యంత దారుణంగా ఉంది. దాదాపు ఇక పనికిరాదన్నట్లే ఉంది. అక్కడ మ్యాగీ నూడుల్స్‌ను సెట్ చేశాడు. ఆ తర్వాత అక్కడ మ్యాగీలోని స్పైసెస్, గ్లూ వంటివి వేసి... గ్యాప్ ఫిలప్ చేశాడు. తర్వాతేముంది... వాష్ బేసిన్ ఆకారంలో దాన్ని చక్కగా పాలిష్ చేశాడు. తర్వాత వైట్ పెయింట్‌ వేశాడు. ఆ తర్వాత చూస్తే ఆసలు వాష్ బేసిన్ పగిలినదని నమ్మేలాగానే లేదు.


Loading...
ఈ వీడియోను మారియా ఫెర్నాండెజ్ ఇంటీరియర్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తర్వాత అది ట్విట్టర్‌లో వైరల్ వీడియో అయ్యింది. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మ్యాగీతోపాటూ స్పైసెస్ కూడా ఎందుకు వేశారని ఓ మహిళ ప్రశ్నించారు. మరో నెటిజన్ అయితే, ఈ ప్రయోగం చెయ్యడానికి ఓ షింక్ కొని పగలగొట్టాలా అని క్వశ్చన్ చేశారు.

 

ఇవి కూడా చదవండి :

ఆశ్రమం ముసుగులో వ్యభిచారం... అడ్డంగా దొరికిన ఏడుగురు...

అనసూయకు తీరని కోరిక... మరోసారి ట్రై చేస్తానంటున్న బ్యూటీ...

ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ... దెబ్బేసిన కేంద్రం... నిధుల కోసం వేల కోట్ల అప్పులు...

వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపారా..? ముగ్గురిపై పోలీసుల అనుమానాలు...
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...