Video: పెళ్లి కాన్సిల్ అంటూ అలిగిన వధువు.. కారణం తెలుసా?

పెళ్లి కాన్సిల్ అంటూ అలిగిన వధువు (image credit - instagram)

Viral Video: పెళ్లిళ్లు ఆగిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చికెన్ ముక్క కోసం పెళ్లిలో కొట్టుకున్న సందర్భాలను చూశాం. ఇది మరో రకం. ఆ పెళ్లికూతురు బాధేంటో తెలుసుకుందాం.

 • Share this:
  Viral Video: పెళ్లి వేడుకల్లో మీరు వధూవరులు డాన్స్ చేయడం, వారిని ఫ్రెండ్స్ సరదాగా ఏడిపించడం వంటివి వైరల్ వీడియోలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చూడబోయేది వధువు ఆగ్రహావేశాల్ని. పెళ్లి మంటపానికి వెళ్తున్న ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆమె ఫేసులో కలర్స్ మారిపోయాయి. యాంగ్రీ యంగ్ గర్ల్ అయిపోయింది (Bride angry on entry). ఆమెకు కోపం ఎంతలా వచ్చిందంటే... చివరకు ఆ పెళ్లి కాన్సిల్ చేసుకునేందుకు కూడా ఆమె వెనకాడలేదు. అసలు అంతటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకుందాం.

  ఈ యాంగ్రీ బ్రైడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం ఏంటో తెలిస్తే... ఇంత సిల్లీ కారణానికే అంతలా సీరియస్ అయిపోవాలా అని మొదట అనిపించడం సహజం. కానీ... మనమే ఆమె ప్లేస్‌లో ఉంటే... మనం కూడా అలాగే ప్రవర్తిస్తామేమో అనేది మరో యాంగిల్.

  ఈ వీడియోలో చూడొచ్చు... వధువును బంధువులంతా కలిసి... పెళ్లి మండపానికి తీసుకొస్తున్నారు. అదే సమయంలో... వధువు ఉన్నట్టుండి సీరియస్ అయిపోయింది. తన చుట్టు పక్కల వాళ్లతో సీరియస్‌గా మాట్లాడింది. అందరూ ఏమైంది, ఏమైంది అనుకుంటూ చూడసాగారు.

  తాను ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రత్యేక సాంగ్ ప్లే చెయ్యాలని ఆమె ముందే చెప్పింది. కానీ... నిర్వాహకులు అది కాకుండా ఇంకేదో ప్లే చేశారు. దాంతో వధువు తీవ్ర నిరాశ చెందింది. నేను ముందే చెప్పాను అయినా సరే... అది ప్లే చెయ్యట్లేదు అని ఆమె తీవ్ర నిరాశ చెందింది.

  ఆ వీడియోని ఇక్కడ చూడండి.  నిజమే పెళ్లి అనేది జీవితంలో జరిగే మధురమైన ఘట్టం. దాన్ని ఇలా జరుపుకోవాలి అని ప్రతి ఒక్కరికీ కొన్ని ఆశలు ఉంటాయి. అలా జరగకపోతే... ఏదో వెలితిగా ఉంటుంది. అది జీవితాంతం గుర్తొస్తూ బాధపెడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ వధువు అంతలా అప్‌సెట్ అయ్యింది. ఆ పాటను కావాలంటే తాము పాడతామని వధువు సోదరీమణులు, ఫ్రెండ్స్, ఇతరులు చెప్పినా ఆమె అప్పటికే డిజప్పాయింట్ అయిపోయింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేనన్నట్లు నిట్టూర్చింది.

  ఇది కూడా చదవండి: Amazon: అమెజాన్ సీక్రెట్ వెబ్‌సైట్.. అక్కడ అన్నీ సగం ధరకే!
  ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లలో చాలా మంది ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. ముందే చెప్పినప్పుడు అలాగే చెయ్యాలి కదా... ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి కదా అని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం... ఇంత చిన్న విషయానికే అంతలా ఫీలైతే ఎలా అంటున్నారు. పెళ్లి అన్నాక చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి... ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఈ పెళ్లి జరిగిందని సమాచారం.
  Published by:Krishna Kumar N
  First published: