news18-telugu
Updated: December 1, 2020, 12:24 PM IST
పక్షి లాంటి వింత చేపలు (credit - twitter)
దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కి దగ్గర్లో ఉన్న ఫిష్ హోక్ సముద్ర తీరానికి ఈమధ్య వింత జీవులు కొట్టుకొచ్చాయి. వాటి ఆకారం చాలా చిత్రంగా ఉంది. బ్లూ, వయలెట్ కలర్లో... పక్షుల రెక్కల లాంటి రెక్కలతో... డ్రాగన్ ఆకారంలో ఉన్నాయి ఆ వింత చేపలు. దాదాపు 20 చేపలు తీరంలో కనిపించాయి. వీటిని చూసి స్థానిక పర్యాటకులు మొదట భయపడ్డారు. సముద్రం లోపల ఏవైనా వింత జీవులు ఉన్నాయోమో... వాటి పిల్లలు ఇలా వచ్చాయేమో అనుకున్నారు. ఐతే... సముద్ర పరిశోధకులకు ఈ విషయం తెలిసింది. వాళ్లు వెళ్లి పరిశీలించారు. అవి అరుదైన బ్లూ డ్రాగన్ చేపలు అని తెలిపారు. వీటి సైంటిపిక్ నేమ్ గ్లాకస్ అట్లాంటికస్ (glacus atlanticus)
ముందుగా మహిళ వాజెనర్ ఈ చేపల్ని చూసింది. ఫొటో తీసి... సోషల్ మీడియాలో షేర్ చేసింది. సముద్రంలో అందమైన హంతకి అని క్యాప్షన్ పెట్టింది. ఆ ఫొటో వైరల్ అవ్వడంతో... చాలా మంది వాటిని చూసేందుకు బీచ్‌కి వచ్చారు. ఇదివరకు ఇలా సముద్రం ఒడ్డుకు వచ్చిన ఎన్నో జీవులను ఆమె తిరిగి సముద్రంలో వదిలేసేది. కానీ... వీటి జోలికి ఆమె రాలేదు. ఎందుకంటే... వీటి ఆకారం చూసి భయపడింది. ఇవి తనకు హాని చేసే రకం కావచ్చని అనుకుంది.
డేంజరస్ చేపలే:
చూడ్డానికి చిన్నగా ఉండే ఈ చేపలకు విషం ఉంటుంది. తాము వేటాడే జీవులపై అవి విషాన్ని ప్రయోగించి చంపుతాయి. ఈ చేపలకు ముళ్లుంటాయి. వాటితో గుచ్చుతాయి. అలా గుచ్చితే... అక్కడ దురద, నొప్పు వస్తుంది. ఐతే... వీటి వల్ల మనుషులకు అంతగా ప్రాణహాని లేదు. వీటి అందం వీటిని ఎట్రాక్టివ్‌గా మార్చేసింది. ఇవి పక్షులలా, బల్లులలా, ఆక్టోపస్ లా ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ చేపకు సంబంధించిన వీడియో ఒకటి ఫేస్బుక్లో వైరల్ అయ్యింది.
ఇది కూడా చదవండి:Rape and Murder: 8 ఏళ్ల బాలికపై రేప్, హత్య... శవాన్ని బావిలో విసిరేసి అమానుషం
సముద్రం అనంతమైనది. అందులో మనకు తెలియని ఎన్నో జీవులను ఏటా కనిపెడుతూనే ఉన్నారు. వాటిలో బ్లూ క్రాబ్స్ (నీలి పీతలు), పోర్చుగీస్‌లోని మెనోవార్ (men o' war), బ్లూ షెల్స్‌గా పిలిచే జంథినా జంతినా (Janthina janthina) కూడా ఇలాంటివే. అవి కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
Published by:
Krishna Kumar N
First published:
December 1, 2020, 12:22 PM IST