అది పాము లాంటి స్పైడరా... చూసి షాకవుతున్న నెటిజన్లు... వైరల్ వీడియో...

మన భూమిపై వింత వింత జీవులు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. అది ఏంటి అన్న ప్రశ్నకు నెటిజన్లు సమాధానం వెతికారు.

news18-telugu
Updated: June 24, 2020, 10:37 AM IST
అది పాము లాంటి స్పైడరా... చూసి షాకవుతున్న నెటిజన్లు... వైరల్ వీడియో...
అది పాము లాంటి స్పైడరా... చూసి షాకవుతున్న నెటిజన్లు (credit -twitter)
  • Share this:
జనరల్‌గా మనం రకరకాల పాముల్ని చూస్తాం. కొన్ని పాములకు రెండు తలకాయలుంటాయి జన్యుపరమైన కారణాల వల్ల. సరే... ఇప్పుడు మరో రకమైన జీవిని నెటిజన్లు చూస్తున్నారు. అది ఎలా ఉందంటే చూడటానికి పెద్ద సైజు సాలీడు (spider)లా ఉంది. కానీ చుట్టూ కాళ్లకు బదులు... పాములు ఉన్నట్లుగా ఉంది. దాంతో చాలా మంది అది స్నేక్ సాలీడు కావచ్చు అంటూ ఇంటర్నెట్‌లో వీడియో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. అందులో ఆ జీవి... పాములాగే ఉంది. మెల్లగా కదులుతూ... అది సముద్ర నీటిలోకి వెళ్లిపోయింది. ఆ దృశ్యం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. (జనరల్‌గా ఇలా షాకవుతున్నారని చెప్పడం నాకు నచ్చదు. కానీ ఈ వీడియో విషయంలో కొంత ఆశ్చర్యం ఉంది.) ఇలాంటి జీవిని ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అని నెటిజన్లు అంటున్నారు.


ఈ జీవికి మొత్తం ఐదు పాముల లాంటి తోకలు ఉన్నాయి. ప్రతీదీ పాములాగే ఉన్నాయి. కదలికలు కూడా అచ్చం పాములాగే కదులుతున్నాయి. దీన్ని షేర్ చేసిన ట్విట్టరాటీ... ఇదేంటి అని ప్రశ్నించారు.

వైరల్ అయిన ఈ వీడియోని ఇప్పటికే... 2.9 లక్షల మంది చూశారు. 609 మంది లైక్ చేశారు. కొంత మంది భయపడ్డారు. కొందరు జోక్స్ వేశారు. ఇది 2020 కాబట్టే అది కనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ రాశారు. చూస్తుంటే... ఐదు పాములు కలిసి... ఓ తాబేలును తింటున్నట్లు ఉంది అని మరో నెటిజన్ రాశారు. అది ఆస్ట్రేలియాదే అని మరో యూజర్ అనగా... ఏలియన్స్ భూమిపై లేరని అనవద్దు అని మరో యూజర్ తెలిపారు.
బ్రిటిల్ స్టార్ (Image credit: Shaunak Modi/Marine Life of Mumbai)


కొంత మంది మాత్రం అది ఏంటి అనే అంశంపై లోతుగా పరిశోధించారు. చివరకు అది బ్రిటిల్ స్టార్ (brittle star) లేదా ఒఫిర్యోయిడ్ (ophiuroid) అని తేల్చారు. వాళ్లు చెప్పింది నిజమే. అది బ్రిటిల్ స్టారే. ఇవి దాదాపు స్టార్ ఫిష్ లాంటివి. సముద్రంలో ఇసుకపై తిరుగుతాయి. ఆ చుట్టూ ఉన్నవి వాటి చేతులు కింద లెక్క. వీటిని సర్వ తారలు (serpent stars) అని కూడా పిలుస్తారు. వీటి చేతులు... 60 సెంటీమీటర్ల పొడవు దాకా ఉంటాయి. ప్రస్తుతం ఈ జీవుల్లో 2000 రకాలు బతికి ఉన్నాయి. వీటిలో 1200 జాతులు... సముద్రాల్లో ఉన్నాయి.
First published: June 24, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading