హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: రివెంజ్ మాములుగా లేదుగా..ప్రేమించి కాదంటున్నాడని..అతని ప్రేయసి ఏం చేసిందంటే..

Viral Video: రివెంజ్ మాములుగా లేదుగా..ప్రేమించి కాదంటున్నాడని..అతని ప్రేయసి ఏం చేసిందంటే..

Photo Credit : You Tube

Photo Credit : You Tube

Viral Video: ప్రేమించినప్పుడు గిఫ్ట్‌లు ఇవ్వడం, బ్రేకప్‌ అయిపోతే ఆ గిఫ్ట్‌లను వెనక్కి తీసుకోవడం... ఇలాంటి సీన్లు మనం సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూసుంటాం. కానీ, ఇక్కడ ఓ ప్రేయసి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రేమించినప్పుడు గిఫ్ట్‌లు ఇవ్వడం, బ్రేకప్‌ అయిపోతే ఆ గిఫ్ట్‌లను వెనక్కి తీసుకోవడం... ఇలాంటి సీన్లు మనం సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూసుంటాం. అయితే బ్రేకప్‌ చెప్పాడని ఏకంగా ప్రియుడికి ఇచ్చిన కాస్ట్‌లీ గిఫ్ట్‌ని పెట్రోల్‌ పోసి కాల్చేసింది ఓ మహిళ. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ. ఈ ఘటన జరిగింది బ్యాంకాక్‌లో. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమైందంటే... అది బ్యాంకాక్‌లోని శ్రినాఖారినవిరోట్‌ యూనివర్శిటీలోని ప్రసర్న్‌మిట్‌ డిమాన్‌స్ట్రేషన్‌ స్కూలు భవనం. అందులో మూడో ఫ్లోర్‌లో ఉన్న పార్కింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొత్తం పొగతో నిండిపోయింది. అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని ఫైర్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా పరిస్థితుల వల్ల పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక ఏమైందా... అని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి కాస్త ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్‌ మీద పెట్రోల్‌ పోసి తగలబెట్టడం గమనించారు పోలీసులు. ఏమైందా అని ఆరా తీస్తే అసలు విషయం తేలింది.

బ్యాంకాక్‌కు చెందిన కనాక్‌ వావన్‌ అనే 36 ఏళ్ల మహిళ గురించే ఇదంతా. అక్కడ ఓ పాఠశాలలో పని చేస్తున్న ఓ వ్యక్తితో ఆమె కొద్ది కాలంగా ప్రేమలో ఉంది. అయితే ఏమైందో కానీ, అతను ఆమెకు దూరమయ్యాడు. దీంతో ఆగ్రహించిన కనాక్‌.. ఎలాగైనా అతనికి తన కోపాన్ని తెలియజేయాలని అనుకుంది. అందుకే అతని కాస్ట్‌లీ బైక్‌ను పెట్రోల్‌ పోసి కాల్చేసింది. అయితే ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అధికారులు సకాలంలో స్పందించడంతో మిగిలిన ప్రాంతాలకు మంటలు అంటుకోలేదు.

' isDesktop="true" id="930456" youtubeid="wTZ1N6w1pUQ" category="trending">

ప్రమాదానికి కారణమైన కనాక్‌ వావన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్‌ ధర ఒక మిలియన్‌ బాట్‌ అంట. అంటే మన కరెన్సీలో సుమారు ₹23 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొని ఇచ్చిందట. ఇప్పుడు ఇద్దరూ విడిపోవడంతో కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టాలని నిర్ణయించిందట. ప్రియుడి మీద కోపాన్ని చూపించడానికే అలా చేశానని కనాక్‌ విచారణలో తెలిపింది. ఆమె ఎమోషనల్‌లో కోపానికి ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Bangkok, Love cheating, Thailand, Viral Video

ఉత్తమ కథలు