సాధారణగా కోతులు, చింపాంజీల చేష్టలు నవ్వుతెప్పించే విధంగా ఉంటాయి. మన ఇంట్లో లేదా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కోతులు మూకుమ్మడిగా దాడిచేస్తుంటాయి. ఆహార పదార్థాలను లాక్కెళ్లి తింటుంటాయి. అవి అచ్చం మనుషుల మాదిరిగా ఫలాలను గింజలు తిసేసీ మరి తింటాయి. అంతే కాకుండా చాలా చేసే పనులు ఫన్నీగా ఉంటాయి. జూలలో, సఫారీలలో అప్పుడప్పుడు, కోతులు, చింపాంజీలు ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. ఇప్పటికే ఈ కోవకు చెందిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా, మరో వీడియో (Viral video) వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. థాయ్ లాండ్ లోని (Thailand) బ్యాంకాక్ లో ఒక చింపాజీ వింతగా ప్రవర్తించింది. అక్కడ సఫారీలోని నిర్వాహకులు.. చింపాంజీకి ప్రత్యేకంగా ప్యాంటు వేశారు. అంతే కాకుండా.. అక్కడికి ఒక మహిళ ఫోటో షూట్ కోసం వచ్చింది. అప్పుడు.. సౌమియా స్వింగ్ జీన్ ప్యాంట్ ధరించిన మహిళ పక్కన చింపాంజీ కూర్చుంది. అంతే కాకుండా.. అది ఆమెకు ముద్దులు పెట్టింది. అంతటితో ఆగకుండా పలుమార్లు హగ్ చేసుకుంది. ఆ తర్వాత.. చేతికి ముద్దులు పెడుతు ప్రపోజ్ కూడా చేసింది.
View this post on Instagram
దీన్ని చూసిన అక్కడున్న సందర్శకులు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. సౌమియా చంద్రశేఖరన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో సఫారీ వరల్డ్‌ను సందర్శించి చింపాంజీతో ఫోటోషూట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 20కి పైగా కామెంట్‌లతో 5.3 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలు మరియు 255,288 లైక్‌లు వచ్చాయి.
ఇదిలా ఉండగా ఒక ఏనుగు భారీ నీటి ప్రవాహంలో చిక్కుకుంది.
కేరళలో (Kerala) షాకింగ్ ఘటన జరిగింది. త్రిస్సూర్ జిల్లాలోని అటవీకి సమీపంలో ఉన్న ప్రాంతంలో గత మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా, కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి (Heavy rain) చలకుడి నది పొంగిపోర్లు తుంది. నది మధ్యలో ఒక ఏనుగు చిక్కుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో... ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ చేపట్టారు.
ఏనుగు (Elephant) రాత్రి సమయంలో అడవి దాటడానికి ప్రయత్నించి.. నీళ్లలో ఇరుక్కుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఏనుగు.. కొంత దూరం నీటి ప్రవాహంలో కొన్ని మీటర్లు దూరం కొట్టుకుపోయింది. ఆ తర్వాత.. అక్కడ కాస్త ఒడ్డులాగ ఉండటంతో.. దాన్ని ఆధారం చేసుకొని తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే.. నీటి ప్రవాహాన్ని, లోతును గుర్తించడానికి ఏనుగు ఎప్పటికప్పుడు, తన తుండాన్ని నీటిలో ముంచడాన్ని స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Thailand, Viral Video