మా అమ్మాయిని పెళ్లాడితే రూ. 2 కోట్లిస్తా.. థాయ్ వ్యాపారి బంపర్ ఆఫర్

దేశమేదైనా, ప్రాంతమేదైనా.. పెళ్లీడొచ్చిన కుర్రాళ్లంతా భాగస్వామి కోసం కలలు కంటూ ఉంటారు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికోసమే ఓ థాయ్‌ల్యాండ్ వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆర్నావ్ రోడాంగ్ అనే మిలియనీర్.. తన కూతుర్ని పెళ్లి చేసుకునే వారికి భారీ నజరానా ప్రకటించాడు.

news18-telugu
Updated: March 8, 2019, 2:22 PM IST
మా అమ్మాయిని పెళ్లాడితే రూ. 2 కోట్లిస్తా.. థాయ్ వ్యాపారి బంపర్ ఆఫర్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 8, 2019, 2:22 PM IST
దేశమేదైనా, ప్రాంతమేదైనా.. పెళ్లీడొచ్చిన కుర్రాళ్లంతా భాగస్వామి కోసం కలలు కంటూ ఉంటారు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికోసమే ఓ థాయ్‌ల్యాండ్ వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆర్నావ్ రోడాంగ్ అనే మిలియనీర్.. తన కూతుర్ని పెళ్లి చేసుకునే వారికి భారీ నజరానా ప్రకటించాడు. అంతేకాదు, అల్లుడికి తన వ్యాపారంలో వాటా కూడా ఇస్తానని ప్రకటించాడు. పేస్‌బుక్ వేదికగా ఆర్నాన్ రోడాంగ్ చేసిన ప్రకటన.. ఇప్పుడు వైరలవుతోంది. ‘‘ నా కూతురికి 26 ఏళ్లు. తనకు బాయ్‌ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పటివరకూ ఏ అబ్బాయీ తనకు నచ్చలేదు. అందుకే  ఈ ప్రకటన చేస్తున్నాను. నా కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే.. రూ. 2కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తా’’ అని పోస్ట్ పెట్టాడు. అంతేనా, తన కూతుర్ని చేసుకోబోయేవాడు ఏ దేశం వారైనా పర్వాలేదని, పెద్దగా చదవకపోయినా ఇబ్బందిలేదని.. కష్టించి పనిచేసే స్వభావం ఉన్నవాడైతే చాలంటున్నాడు ఆర్నాన్. ఈ ప్రకటన చూసి ముందు అందరూ షాకైనా.. తర్వాత ఎవరికివారు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

ఆ మిలీయనీర్ తండ్రి రూ. 2 కోట్ల ఆఫర్ ఇవ్వడానికి కారణం.. ఆ అమ్మాయేమైనా అందవిహీనంగా ఉంటుందా? లేక వేరే లోపాలేమైనా ఉన్నాయా? అంటే అదేం కాదు. ఆమె అందగత్తె. కానీ ఇప్పటివరకూ ఆమెను మెప్పించే పురుషుడు కనిపించలేదట. ఆమె మనసుకు ఎవరూ నచ్చడం లేదట. ఆమె కోసం అబ్బాయిలను చూసీచూసీ అలసిపోయిన ఆర్నామ్.. చివరకు ఈ ప్రకటన చేశాడు. మీలో ఎవరైనా తన కూతురి మనసుగెలిచే సత్తా గలవారున్నారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాంటివారికి రూ. 2 కోట్ల నజరానా ప్రకటించాడు.
ఈ ఆఫర్ విషయం ఆర్నాన్ కూతురు కర్నిస్టాకు కూడా తెలిసిపోయింది. అయితే, తండ్రి చేసిన పనికి ఆమె సింపుల్‌గా నవ్వేసి ఊరుకుందట. తనను మెప్పించేవాణ్ని, మనసుకు నచ్చేవాణ్ని వెతికేందుకు తండ్రి ప్రయత్నాలను చూసి ముచ్చటపడిందట. తండ్రి చెప్పినట్టుగా, కష్టపడే మనస్తత్వం ఉన్నవాడే తనకు భర్తగా కావాలని చెప్పింది. అయితే, రూ. 2 కోట్లు తన నుంచి గెలవడం అంత ఈజీ కాదని చెప్పిందట. ఈ లెక్కన ఆమెకు నచ్చడం అంత వీజీ కాదని మాత్రం అర్థమైపోతోంది. అది తెలిసే ఈ వ్యాపారి ఇలాంటి ఆఫర్ ప్రకటించారనే ప్రచారం జరుగుతోంది.

First published: March 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...