భారతీయ పర్యాటకులే కావాలంటున్న థాయ్‌ల్యాండ్... మనమంటే ఎందుకంత ప్రేమ...

Thailand Tourism : అద్భుత పర్యాటక ప్రదేశాలు, సముద్ర తీరాలు, రిసార్డులు, హనీమూన్ స్పాట్‌లతో అలరించే దేశం థాయ్‌ల్యాండ్. ఏటా అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలా కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: January 28, 2019, 10:09 AM IST
భారతీయ పర్యాటకులే కావాలంటున్న థాయ్‌ల్యాండ్... మనమంటే ఎందుకంత ప్రేమ...
థాయ్‌ల్యాండ్
  • Share this:
ఇండియన్స్ ఎక్కువగా వెళ్లే దేశాల్లో థాయ్‌ల్యాండ్ ఒకటి. గతేడాది భారతీయులు... థాయ్‌ల్యాండ్‌లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లి రూ.15,629 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అక్కడకు వెళ్లిన వాళ్లలో 58 శాతం మంది వారం కంటే ఎక్కువ రోజులే ఉన్నారట. మన వల్ల తెగ అభివృద్ధి చెందుతున్న ఈ ఆగ్నేయ ఆసియా దేశం... మనకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. నిజానికి థాయ్‌ల్యాండ్ సైనిక పాలనలో ఉన్న దేశం. అయినప్పటికీ పర్యాటక రంగం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. ఆ దేశ జీడీపీలో 18 శాతం టూరిజం నుంచే వస్తోంది. గతేడాది ప్రపంచ దేశాల నుంచీ థాయ్‌ల్యాండ్‌కి 4.15 కోట్ల మంది వెళ్లారు. 2017తో పోల్చితే... 2018లో 17 శాతం ఎక్కువగా దర్శించారు.

indian tourists, indians in thailand, thailand tourists, thailand trip, thailand indian, thaliland tourists, thailand tourist visa, thailand indian wedding, thailand travel, థాయిల్యాండ్ పర్యాటక ప్రదేశాలు
థాయ్‌ల్యాండ్

థాయ్ ప్రభుత్వం ఏటా పర్యాటకుల సంఖ్యను పెంచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తోంది. ఈసారి "అద్భుతమైన థాయ్‌ల్యాండ్ నిగూఢ రహస్యాలు" పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా తొలిసారి వచ్చే పర్యాటకులు, కపుల్స్, కొత్తగా పెళ్లైన వాళ్లు, మహిళల్ని ఎట్రాక్ట్ చేస్తోంది. మీకు తెలుసా... 2018లో 300 మంది భారతీయ జంటలు థాయ్‌ల్యాండ్‌లో పెళ్లిళ్లు చేసుకున్నారు.

indian tourists, indians in thailand, thailand tourists, thailand trip, thailand indian, thaliland tourists, thailand tourist visa, thailand indian wedding, thailand travel, థాయిల్యాండ్ పర్యాటక ప్రదేశాలు
థాయ్‌ల్యాండ్
డాలర్‌తో పోల్చితే థాయ్ కరెన్సీ బాత్ రేటు తక్కువే. మనకు 10 బాత్‌లు కావాలంటే... మనం సుమారుగా రూ.23 ఇవ్వాలి. అందువల్ల థాయ్‌ల్యాండ్ వెళ్లేందుకు భారతీయులు ఇష్టపడుతున్నారు. పైగా అక్కడ అద్భుతమైన ప్రకృతి, చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి.

indian tourists, indians in thailand, thailand tourists, thailand trip, thailand indian, thaliland tourists, thailand tourist visa, thailand indian wedding, thailand travel, థాయిల్యాండ్ పర్యాటక ప్రదేశాలు
థాయ్‌ల్యాండ్

థాయ్ వెళ్లే పర్యాటకుల్లో భారతీయులది ఆరో స్థానం. 2018లో 16 లక్షల మంది అక్కడికి వెళ్లారు. మన కంటే ముందు పొజిషన్‌లో జపాన్ ఉండగా... మన తర్వాతి స్థానంలో రష్యా ఉంది. అక్కడికి వెళ్లే భారతీయుల్లో ఎక్కువ మంది విడివిడిగా వెళ్తున్నవారే. గ్రూపులు తక్కువే.
indian tourists, indians in thailand, thailand tourists, thailand trip, thailand indian, thaliland tourists, thailand tourist visa, thailand indian wedding, thailand travel, థాయిల్యాండ్ పర్యాటక ప్రదేశాలు
థాయ్‌ల్యాండ్

థాయ్‌ల్యాండ్‌లో ఇండియన్స్ ఎక్కువగా బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్, చియాంగ్ మాయ్, కో సముయ్, చియాంగ్ రాయ్, క్రాబీ, అయుత్తాయా, కో చాంగ్ పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. ఇక ఆ దేశంలో భారతీయ సినిమా షూటింగ్స్, పెళ్ళిళ్లు, పార్టీలూ, హనీమూన్లూ ఏటా పెరుగుతూనే ఉన్నాయి.

indian tourists, indians in thailand, thailand tourists, thailand trip, thailand indian, thaliland tourists, thailand tourist visa, thailand indian wedding, thailand travel, థాయిల్యాండ్ పర్యాటక ప్రదేశాలు
థాయ్‌ల్యాండ్

థాయ్‌కి వెళ్లే భారతీయుల్లో మధ్య తరగతి ప్రజల సంఖ్య ఏటా పెరుగుతోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నగరాలైన అహ్మదాబాద్, పుణె, అమృత్‌సర్, భువనేశ్వర్‌లో జనాభాని రారమ్మని పిలుస్తూ... అమేజింగ్ థాయ్‌ల్యాండ్ ప్రోగ్రాం తెచ్చింది అక్కడి ప్రభుత్వం.

indian tourists, indians in thailand, thailand tourists, thailand trip, thailand indian, thaliland tourists, thailand tourist visa, thailand indian wedding, thailand travel, థాయిల్యాండ్ పర్యాటక ప్రదేశాలు
థాయ్‌ల్యాండ్

మన దేశంలో కూడా థాయ్ హోటళ్లు, రిసార్టులు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లూ, ఎయిర్‌లైన్స్, టూరిస్ట్ ఎట్రాక్షన్స్ పెరుగుతున్నాయి. భారతీయుల వల్ల తమకు బోలెడంత లాభం ఉందని థాయ్ ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకూ వీసా ఆన్ ఎరైవర్ పేరుతో వసూలు చేసే రూ.4,500 ఫీజును రద్దు చేసింది. భారతీయులతోపాటూ మరో 21 దేశాల్లో ప్రజలకు ఈ రద్దు వర్తిస్తుంది.

indian tourists, indians in thailand, thailand tourists, thailand trip, thailand indian, thaliland tourists, thailand tourist visa, thailand indian wedding, thailand travel, థాయిల్యాండ్ పర్యాటక ప్రదేశాలు
థాయ్‌ల్యాండ్

ప్రతి వారం మన దేశంలోని 16 నగరాల నుంచీ థాయ్‌ల్యాండ్‌కి 307 వీక్లీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. థాయ్ ఎయిర్‌వేస్, బ్యాంకాక్ ఎయిర్‌వేస్, థాయ్ స్మైల్, భూటాన్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్ జెట్, ఇండిగో సహా 13 ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. 2023 నాటికి ఏటా 50 లక్షల మంది భారతీయులు థాయ్‌ల్యాండ్ రావాలని ఆ దేశం టార్గెట్‌గా పెట్టుకుంది.

Video: విటమిన్ డి వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసా ?
First published: January 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు