Home /News /trending /

TEXAS WOMAN AYANNA WILLIAMS CUTS HER NAILS FIRST TIME AFTER 30 YEARS CREATS GUINNESS WORLD RECORDS FULL DETAILS HERE GH SSR

Longest fingernails: 30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి గోళ్లను కత్తిరించిన మహిళ.. ఆ గోళ్లు ఎన్ని అడుగుల పొడువున్నాయో తెలిస్తే..

అయన్నా విలియమ్స్ (ఫైల్ ఫొటో)

అయన్నా విలియమ్స్ (ఫైల్ ఫొటో)

అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉండే అయన్నా విలియమ్స్ అనే మహిళకు చేతి వేళ్లకు అతిపెద్ద గోళ్లు ఉన్నాయని గిన్నిస్ రికార్డ్స్ 2017లో ధ్రువీకరించింది. రెండు చేతుల వేళ్లకు పొడవైన గోళ్లు ఉన్న మహిళగా అయన్నా గిన్నిస్ రికార్డు సాధించింది.

చేతి వేళ్లకు అతిపెద్ద గోళ్లు కలిగిన మహిళగా రికార్డు సాధించిన మహిళ.. తాజాగా వాటిని కత్తిరించుకొని వార్తల్లో నిలుస్తోంది. గత వారం పొడవైన గోళ్లను వైద్యుల సహాయంతో ఆమె తొలగించుకుంది. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉండే అయన్నా విలియమ్స్ అనే మహిళకు చేతి వేళ్లకు అతిపెద్ద గోళ్లు ఉన్నాయని గిన్నిస్ రికార్డ్స్ 2017లో ధ్రువీకరించింది. రెండు చేతుల వేళ్లకు పొడవైన గోళ్లు ఉన్న మహిళగా అయన్నా గిన్నిస్ రికార్డు సాధించింది. ఆమె తాజాగా వాటిని తీసివేయాలని నిర్ణయించుకుంది. ఆఖరిసారి గోళ్లను కొలిచినప్పుడు వాటి పొడవు 733.55 సెంటీమీటర్లుగా (24 అడుగుల 0.7 అంగుళాలు) నమోదైంది. మొత్తానికి అయన్నా 30 సంవత్సరాల తరువాత గోళ్లను కత్తిరించుకోవడం విశేషం.

టెక్సాస్‌లోని ఫోర్త్ వర్త్ ప్రాంతానికి చెందిన డాక్టర్ అల్లిసన్ రీడింగ్ అనే డెర్మటాలజిస్టు సాయంతో అయన్నా గోళ్లు తొలగించుకుంది. డాక్టర్లు ఇందుకు ఎలక్ట్రిక్ రోటరీ టూల్‌ను ఉపయోగించారు. అంతకు ముందు చివరిసారి వాటి పొడవు కొలిచారని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించింది. గత మూడు దశాబ్దాలుగా ఆమె తన గోళ్లను కత్తిరించలేదు.




వాటితో ఇబ్బందులు
గిన్నిస్ రికార్డు సాధించేనాటికి అయన్నా గోళ్ల పొడవు 576.4 సెంటీమీటర్లుగా (18 అడుగుల 10.9 అంగుళాలు) ఉంది. ఆమె మానిక్యూర్ చేసుకోడానికి 20 గంటల సమయం పట్టేది. ఒకసారి వాటికి నెయిల్ పాలిష్ వేసుకోవడానికి రెండు సీసాల నెయిల్ పాలిష్ అవసరం అయ్యేది. ఈ గోళ్లతో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని అయన్నా తెలిపింది. ఇంటి పనులు చేసుకోవడం కష్టమయ్యేదని చెప్పింది. తన గోళ్ల వయసు గుర్తొస్తే ఆశ్చర్యం వేసేదని ఆమె వివరించింది. ఇన్ని సంవత్సరాల తరువాత గోళ్లను తొలగించుకోవడంతో భావోద్వేగానికి గురైనట్లు అయన్నా పేర్కొంది.

మ్యూజియంలో ప్రదర్శన
కత్తిరించిన చేతి గోళ్లను ఫ్లోరిడాలోని ఒక మ్యూజియంలో ప్రదర్శిస్తారు. ఓర్లాండో ఉన్న ‘రిప్లేస్.. బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో వీటిని ప్రదర్శనలో పెట్టనున్నారు. అయన్నా గోళ్లతో ఉన్నప్పుడు, వాటిని తీసివేసిన తరువాత ఫోటోలను, కత్తిరించిన రెండు చేతివేళ్ల గోళ్ల ఫోటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: America, Texas, Trending news, Trending videos, VIRAL NEWS, Viral Videos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు