లిఫ్టు దగ్గర ఇరుక్కున్న కుక్క... కాపాడిన యువకుడు

Texas : సమయానికి అతను రాకపోయి ఉంటే... ఆ మూగజీవి ప్రాణాలు లిఫ్టులో కలిసిపోయేవే.

news18-telugu
Updated: December 13, 2019, 2:14 PM IST
లిఫ్టు దగ్గర ఇరుక్కున్న కుక్క... కాపాడిన యువకుడు
లిఫ్టు దగ్గర ఇరుక్కున్న కుక్క... కాపాడిన యువకుడు (credit - twitter - NowThis)
  • Share this:
టెక్సాస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిందీ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్. ఓ మహిళ తన పప్పీతో లిఫ్టు దగ్గరకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి జానీ మాథిస్... లిఫ్టు లోంచీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆమె లిఫ్టులోకి వెళ్లి... డోర్ క్లోజ్ చేసింది. ఐతే... తనతోపాటూ తెచ్చుకున్న కుక్క కూడా లిఫ్టులోకి వచ్చేసిందని ఆమె అనుకుంది. కానీ ఆ కుక్క లిఫ్టు బయటే ఉండిపోయింది. దాని మెడకు కట్టిన చైన్‌ లిఫ్టులో ఉండిపోయింది. లిఫ్ట్ డోర్ తిరిగి ఓపెన్ కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాని ఆమె... లిఫ్టులో ఉండి అరవసాగింది. ఇటు బయట నుంచీ కుక్క గింజుకోసాగింది. అది గ్రహించిన జానీ మాథిస్... వెంటనే కుక్క మెడకు కట్టిన చైనును రిలీజ్ చెయ్యడానికి నానా తిప్పలు పడ్డాడు. అటు చూస్తే లిఫ్ట్ పైకి వెళ్లిపోతోంది. కుక్కకు కట్టిన చైన్ పైకి వెళ్లసాగింది. ఇటు చూస్తే... కుక్కకు ఉన్న చైన్ ఊడిరావట్లేదు. అలాంటి ఉత్కంఠ క్షణాల్లో మాథిస్... లక్కీగా చైనును అన్ లాక్ చేశాడు. దాంతో... కుక్కకు ప్రాణాలు దక్కాయి. ఆ కుక్క యజమాని ఉండేది తన పక్క ఇంట్లోనే. తన కుక్క చనిపోతుందనే భయపడిన ఆమె... దాని ప్రాణాలు కాపాడినందుకు అతనికి మరీ మరీ థాంక్స్ చెప్పింది. ఇంత మంచిపని చేశాక అతన్ని మెచ్చుకోకుండా ఉంటారా... సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

 

Pics : చీరకే వన్నె తెస్తున్న వంటలక్క...


ఇవి కూడా చదవండి :

 

తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య... దర్శనాలు తాత్కాలిక నిలుపుదల

బ్రిటన్ ప్రధానిగా మళ్లీ గెలిచిన బోరిస్ జాన్సన్

Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...

Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి

Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు