• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • TEXAS FREEZES WITHOUT WATER AND ELECTRICITY IN AMERICA HERE ARE VIRAL PHOTOS SK

Texas Freeze: గడ్డ కట్టిన అమెరికా.. మంచు బీభత్సాన్ని కళ్లకు కట్టే దృశ్యాలిదిగో

Texas Freeze: గడ్డ కట్టిన అమెరికా.. మంచు బీభత్సాన్ని కళ్లకు కట్టే దృశ్యాలిదిగో

గడ్డ కట్టిన అమెరికా.. మంచు బీభత్సాన్ని కళ్లకు కట్టే దృశ్యాలిదిగో

టెక్సాస్‌లో పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరా లేక 27 లక్షల మంది అంధకారంలో ఉంటున్నారు. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. ఈ క్రమంలో అక్కడి మంచు బీభత్సం ఫొటోలను సోషల మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు

  • Share this:
    అమెరికా ఐస్ ఏజ్ సినిమాను తలపిస్తోంది. ముఖ్యంగా టెక్సస్ స్టేట్ మంచు ఖండంలా మారిపోయింది. ఎక్కడ చూసినా మంచు తప్ప ఇంకేం కనిపించడం లేదు. మన వద్ద డీప్ ప్రీజర్‌లో పెడితేనే నీళ్లు గడ్ట కడతాయి. కానీ అమెరికాలో మామూలుగానే నీళ్లు కడ్డగట్టుతున్నాయి. సింక్‌లో ట్యాప్ తిప్పినా.. బిందె తెరిచినా..ఐసే కనిపిస్తోంది. చివరకు టాయిలెట్‌లో కమోడ్‌లో కూడా నీళ్లు గడ్డ కట్టుకుపోయాయి. అక్కడ నీళ్లు తాకాలంటే మంచును బాగా మరిగించి తాగాలి. అది క్షణాల్లోనే తీసుకోవాలి. లేదంటే మళ్లీ గడ్డ కట్టుకుపోతున్నాయి. అంత దారుణంగా ఉంది టెక్సాస్‌లో తాజా పరిస్థితి.

    టెక్సాస్‌లో పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరా లేక 27 లక్షల మంది అంధకారంలో ఉంటున్నారు. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. ఈ క్రమంలో అక్కడి మంచు బీభత్సం ఫొటోలను సోషల మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు















    టెక్సాస్‌లో ఉన్న పలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోలేక గడ్డకట్టుకుపోతున్నాయి. ఆ చలిని భరించలేక ప్రాణాలు కోల్పోతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: