గత కొంతకాలంగా దాడులు, కాల్పులు, పేలుళ్ల వంటి ఉగ్రఘాతుకాలు లేవని జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తెగబడ్డారు టెర్రరిస్ట్‌లు(Terrorist). అత్యంత దారుణంగా ఓ బ్యాంక్(Bank)లోకి చొరబడి ఉద్యోగులపై విచక్షారహితంగా కాల్పులు జరిపారు. జమ్ముకశ్మీర్(Jammu Kashmir)కుల్గాం(Kulgam)జిల్లాలోని ఆరేహ్ మోహన్‌పోరా(Areh Mohanpora) ప్రాంతంలో ఉన్న ఎలాఖతి దేహతి(Elakhati Dehati)బ్యాంక్‌లోకి చేతిలో తుపాకీ, బ్యాగ్(Gun), (Bag)తగిలించుకొని లోపలికి చొరబడ్డ ఉగ్రవాది అందులో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై కాల్పులు జరిపాడు. టెర్రరిస్ట్ బ్యాంక్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ఎవర లేకపోవడంతో నేరుగా మేనేజర్ క్యాబిన్ (Manager Cabin)దగ్గరకు వచ్చి గురిపెట్టి తుపాకీతో కాల్చాడు. ఈ దుర్ఘటనలో ఎలాఖాతి దేహతి బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్(Vijay Kumar)శరీరంలోకి బుల్లెట్‌లు దూసుకెళ్లడతం తీవ్రంగా గాయపడ్డాడు.
కుల్గాంలో ఉగ్రదాడి..
వెంటనే బ్యాంక్ మేనేజర్‌ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెర్రరిస్ట్ బ్యాంకులోకి చొరబడిన దగ్గర నుంచి మేనేజర్ విజయ్‌కుమార్‌పై కాల్పులు జరిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉగ్రవాదులు ఓ పథకం ప్రకారమే బ్యాంక్‌ని చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లుగా స్థానిక పోలీసులు నిర్ధారించారు. కాల్పులకు తెగబడి ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్‌ల కోసం పోలీసులు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. మూడ్రోజుల క్రితం కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొరాలోని ఓ రజనీ బాల అనే టీచర్‌ని హతమార్చారు. తమ ఉనికిని చాటుకొని సామాన్య ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ ఉద్యోగిని కాల్చిచంపిన ఉగ్రవాదులు మరో హిందూ టీచర్‌ని పొట్టనపెట్టుకున్నారు. రజనీ బాల స్వస్తలం జమ్ములోని సాంబా జిల్లా. మే నెలలో ముస్లీమేతర ఉద్యోగుల్ని హత్య చేయడం ఇది రెండోది కాగా..జూన్ మొదట్లో అదే ప్రాంతంలో మరో బ్యాంక్‌మ మేనేజర్‌ని హతమార్చడం కలకలం రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Terror attack