TENTH CLASS STUDIED WOMAN EARN 2 LAKHS PER MONTH HERE IS THE BUSINESS SECRET OF HER SSR
Married Woman: ఆమె చదివింది పదో తరగతి.. కానీ నెలకు సంపాదన మాత్రం రూ.2 లక్షల వరకూ.. ఏం చేస్తోందంటే..
నందిని (ఫైల్ ఫొటో)
ఈ రోజుల్లో డిగ్రీలు, పీజీలు చేసిన వారికే వారి చదువుకు తగ్గ జాబ్ లభించడం లేదు. దీంతో ఖాళీగా ఉండలేక ఏదో ఒక జాబ్‌తో నెట్టుకొస్తున్నారు. అలాంటిది కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదివిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో డిగ్రీలు, పీజీలు చేసిన వారికే వారి చదువుకు తగ్గ జాబ్ లభించడం లేదు. దీంతో ఖాళీగా ఉండలేక ఏదో ఒక జాబ్‌తో నెట్టుకొస్తున్నారు. అలాంటిది కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదివిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి స్థితిలో ఉన్న మిగిలిన వారి సంగతేమోగానీ ఇప్పుడు మేం చెప్పబోయే మహిళ పరిస్థితి మాత్రం అలా కాదు. వేరేగా ఉంది. ఎవరూ ఊహించని ఉన్నత స్థాయిలో ఆమె ఉంది. ఇంతకీ ఆమె ఎవరు..? ఎలా ఆ స్థానానికి చేరుకుందంటే..
ఆమె పేరు నందిని. వయస్సు 33 సంవత్సరాలు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి సమీపంలో ఓ చిన్న గ్రామంలో ఉండేది. ఆమె తండ్రి పూజారి. దేవాలయంలో పనిచేసేవాడు. అయితే చిన్నప్పటి నుంచి నందినికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. కానీ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆమె 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఈ క్రమంలో వయస్సు రాగానే ఆమెకు పెళ్లి చేశారు. ఆమె భర్త పేరు శ్రీకాంత శాస్త్రి. అతను కూడా పూజారే. అయితే తండ్రి చనిపోవడంతో నందినిపై చెల్లెలి పెళ్లి భారం పడింది. దీంతో ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. భర్త సంపాదనతోపాటు తాను కూడా చిన్న చిన్న పనులు చేసి సంపాదించేది. అయితే అది ఏ మూలకూ సరిపోయేది కాదు. ఈ క్రమంలోనే ఆమె బంధువుల్లో దగ్గరి వారైన కొందరు ఊబర్ సంస్థ గురించి చెప్పారు. అందులో క్యాబ్ నడిపిస్తే దాని వల్ల లాభం ఉంటుందనే సరికి ఆమె, ఆమె భర్త కలిసి తమ వద్ద ఉన్న నగలు తాకట్టు పెట్టి టయోటా కారు కొని ఊబర్‌లో తిప్పడం స్టార్ట్ చేశారు.
అయితే అది కాకుండానే ఊబర్‌లో డబ్బు సంపాదించేందుకు ఇంకో మార్గం కూడా వారికి దొరికింది. అదేమిటంటే… ఊబర్ సంస్థకు ఎవరినైనా రిఫర్ చేసి అందులో క్యాబ్ డ్రైవర్లను చేర్పిస్తే అలా చేర్పించిన వారికి రిఫరల్ అమౌంట్‌ను ఇస్తారు. అది రూ.3వేల వరకు ఉంటుంది. దీంతో నందిని ఆమె భర్త కూడా ఆ పని స్టార్ట్ చేశారు. అందుకోసం ఏకంగా ఓ చిన్నపాటి ఆఫీసును పెట్టి అందులో నలుగురికి పని కల్పించారు. అలా ఆ ఆఫీసు ద్వారా ఇప్పటి వరకు నందిని, ఆమె భర్త కలిసి 600 మంది డ్రైవర్లను ఊబర్‌లో చేర్పించారు.
దీంతో ఒక్కసారిగా ఆమె ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు ఆమె నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఓ వైపు క్యాబ్‌లు తిప్పడం, మరో వైపు రిఫరల్స్‌ను చేర్పించడం.. ఇదీ.. ఆమె చేస్తున్న పని. అందుకే ఇప్పుడా స్థాయికి ఆమె చేరుకుంది. ఏది ఏమైనా ఆమె పడ్డ శ్రమకు తగిన ఫలితం లభించింది కదా. అయితే ఇప్పుడు నందిని మనస్సులో ఉన్న ఆశ ఒక్కటే. తాను ఎలాగూ డాక్టర్ కాలేకపోయింది. తన కూతుర్నయినా డాక్టర్‌ను చేయాలని ఆమె ఆలోచిస్తుంది. ఆమె కలలు నిజం కావాలని మనమూ కోరుకుందాం..!
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.