Home /News /trending /

TENSION IN KARNATAKAS SHIVAMOGGA OVER SAVARKAR POSTER CURFEW IMPOSED PAH

Independence day: అగ్గి రాజేసిన పోస్టర్.. కర్ఫ్యూ విధించిన పోలీసులు.. ఎక్కడంటే..

తనిఖీ చేపట్టిన పోలీసులు

తనిఖీ చేపట్టిన పోలీసులు

Karnataka: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన పలువురు నాయకుల ఫోటోలు పెట్టి నివాళులు అర్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India
దేశ ప్రజలు 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను (Independence day)  ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో దేశం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన వారిని, గుర్తు చేసుకుంటూ.. నివాళులు అర్పిస్తుంటారు. అయితే.. దీనిలో భాగంగా జెండాకు ముందు గాంధీ, అంబేద్కర్, నెహ్రు, వల్లభాయ్ పటేల్, వివేకానందా పలువురు గొప్ప దేశభక్తుల ఫోటోలు పెట్టి నివాళులు అర్పిస్తుంటారు. అయితే.. కర్ణాటకలోని (karnataka)  శివమొగ్గలో (Shivamogga) జరిగిన ఈ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పలువురు దేశ భక్తులను గుర్తు చేసుకుంటూ ఫ్లెక్సీలను ఏర్పాడు చేశారు.

దీనిలో వీర్ సావర్కర్ పోస్టర్ ను కూడా ఏర్పాడు చేశారు. అయితే... దీన్ని మరోక వర్గం వ్యతిరేకించారు. సావర్కర్ పోస్టర్ పట్ల (Savarkar poster)  అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్త.. గొడవల వరకు వెళ్లి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వెంటనే పోలీసులు రంగంలోనికి దిగి ఇరువర్గాలు అక్కడి నుంచి పంపించి వేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ గొడవలు జరగకుండా పెద్ద మొత్తంలో పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. శివమొగ్గలో కర్ఫ్యూను కూడా విధించారు.



సావర్కర్ ఫ్లెక్స్‌ను తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హిందూ అనుకూల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో కర్ణాటక పోలీసులు శివమొగ్గ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇదే ఘటనలో, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మంగళూరులోని సూరత్‌కల్ జంక్షన్‌లో హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరు మీద ఏర్పాటు చేసిన బ్యానర్‌ను తొలగించారు. మంగళూరు నార్త్ బీజేపీ ఎమ్మెల్యే వై భరత్ శెట్టి అభ్యర్థన మేరకు సర్కిల్‌కు సావర్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు మంగళూరు నగర కార్పొరేషన్ గతంలో ఆమోదం తెలిపింది.

సర్కిల్‌కు అధికారికంగా పేరు పెట్టడానికి ప్రభుత్వ అనుమతి కోసం పౌర సంఘం వేచి ఉంది. సూరత్‌కల్‌ మతపరమైన సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్‌డిపిఐ స్థానిక నాయకుడు తెలిపారు. సర్కిల్‌కు సావర్కర్ పేరు పెట్టడాన్ని SDPI వ్యతిరేకిస్తుందని కూడా ఆయన అన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు