Home /News /trending /

TEMPLE PRIEST IN TAMILNADU DHARMAPURI WAS BATHED BY ADDING 108 KG OF CHILLI POWDER TO WATER SSR

Oh My God: 108 కిలోల కారం కలిపిన నీళ్లతో ఆలయ పూజారికి అభిషేకం.. ఇలా ఎందుకు చేశారని ఆ ఊరోళ్లను అడిగితే..

అభిషేకం చేస్తున్న దృశ్యం

అభిషేకం చేస్తున్న దృశ్యం

మన దేశంలో ప్రజలు భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తుంటారు. విభిన్నమైన ఆచారాలకు నెలవైన దేశం మనది. మత విశ్వాసాల విషయంలో ప్రాంతాన్ని బట్టి నమ్మకాలు, ఆచారాలు మారిపోతుంటాయి.

    ధర్మపురి (తమిళనాడు): మన దేశంలో ప్రజలు భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తుంటారు. విభిన్నమైన ఆచారాలకు నెలవైన దేశం మనది. మత విశ్వాసాల విషయంలో ప్రాంతాన్ని బట్టి నమ్మకాలు, ఆచారాలు మారిపోతుంటాయి. ఎక్కడ దాకో ఎందుకు తెలుగు రాష్ట్రమైన కర్నూలు జిల్లాలోని ఓ ఆలయానికి ప్రతీ సంవత్సరం ఒకరోజు ఆ ఊరిలో ఉన్న మగాళ్లంతా స్త్రీల వేషధారణలో వెళ్లి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇదే జిల్లాలోని దేవరగట్టు అనే ప్రాంతంలో ప్రతీ ఏటా దసరా వచ్చిందంటే చాలు వేలాది మంది గుంపులుగా చేరి కర్రలతో దాడి చేసుకుంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ బన్నీ ఉత్సవాలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ఓ భిన్నమైన ఆచారమే తమిళనాడులోని ధర్మపురి ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ ప్రాంతంలోని నడపనహళ్లిలోని ఓ ఆలయంలో భిన్న ఆచారం ఉంది. ఆది అమావాస్య రోజున ఆలయ పూజారికి అభిషేకం చేస్తారు.

    అభిషేకం అంటే.. నీళ్లతోనో, పాలతోనో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కారం నీళ్లతో అభిషేకం చేస్తారు. గత ఆదివారం అమావాస్య రోజున(08-08-2021) పెరియా కరుపాసామి ఆలయంలో ఆలయ పూజారికి కారం నీళ్లతో అభిషేకం జరిగింది. ఇందుకోసం 108 కిలోల కారాన్ని నీళ్లలో కలిపి.. ఆ నీళ్లతో పూజారి గోవిందన్‌కు అభిషేకం జరిగింది. ఇలా చేస్తే దెయ్యాలు, భూతాలు, ఆత్మలు ఆ ఊరిని వీడిపోతాయని అక్కడి భక్తుల నమ్మకం.

    ఇది కూడా చదవండి: Viral: ఈయనెవరు బాబోయ్.. కోపదారి మనిషి 2.0లా ఉన్నాడు.. మరీ ఇంత బీపీ అయితే ఎలా పెద్దాయన..

    అయితే.. ఎంతైనా కారం కదా.. పైగా వంద కిలోలకు పైగా కారాన్ని నీళ్లలో కలపడమంటే మాములుగా ఉండదు. ఆ కారం కలుపుతున్నంత సేపు చుట్టుపక్కల ఉన్న భక్తులంతా ఎంతో ఇబ్బంది పడ్డారు. కొందరు తుమ్ములు, దగ్గులతో అల్లాడిపోయారు. ఆలయంలో పెరియా కురుపాసామికి పాలాభిషేకం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత విగ్రహాన్ని పండు మిరపకాయలతో అలంకరించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు