Home /News /trending /

TELANGANA VOTERS CHECK YOUR NAME IN ELECTORAL LIST BEFORE 2020 JANUARY 15 SS

Voter ID: జనవరి 15 లోగా ఓటరు లిస్ట్‌లో మీ పేరు చెక్ చేసుకోండి

Voter ID: జనవరి 15 లోగా ఓటరు లిస్ట్‌లో మీ పేరు చెక్ చేసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Voter ID: జనవరి 15 లోగా ఓటరు లిస్ట్‌లో మీ పేరు చెక్ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Voter ID | 2020 జనవరి 15 వరకు ముసాయిదాపై జాబితా అభ్యంతరాలను స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. అభ్యంతరాలను పరిశీలించి జనవరి 27 లోగా నిర్ణయం తీసుకుంటారు. సవరించిన అనుబంధ ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 4న ప్రచురిస్తారు. ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదలవుతుంది.

ఇంకా చదవండి ...
    ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? వెంటనే చెక్ చేసుకోండి. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్‌సైట్‌లో ముసాయిదా జాబితా అందుబాటులో ఉంది. www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీ పేరు లేకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా మీ అభ్యంతరాలను వివరించొచ్చు. ముసాయిదా ఓటర్ జాబితా శాసనసభ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ల దగ్గర అందుబాటులో ఉంటుంది. ఓటరు జాబితా వివరాలను https://www.nvsp.in వెబ్‌సైట్‌లో కూడా చూసుకోవచ్చు. 2020 జనవరి 15 వరకు ముసాయిదాపై జాబితా అభ్యంతరాలను స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. అభ్యంతరాలను పరిశీలించి జనవరి 27 లోగా నిర్ణయం తీసుకుంటారు. సవరించిన అనుబంధ ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 4న ప్రచురిస్తారు. ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదలవుతుంది. మరి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.

    ముందుగా www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. టాప్ లెఫ్ట్‌లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే ఓటర్ జాబితాలో మీ ఓటు లేనట్టే. మీ పేరు ఉంటే వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయంగా 'Search by Details' ద్వారా కూడా మీ ఓటు చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ పంపించి కూడా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో కూడా మీ ఓటు చూసుకోవచ్చు.

    మరోవైపు ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది ఎన్నికల సంఘం. 2020 జనవరి 1 తేదీని ప్రాతిపదికగా తీసుకొని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ చేపట్టింది ఎన్నికల సంఘం. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారంతా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు.

    Realme X2: రియల్‌మీ ఎక్స్2 రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Coal India Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1326 జాబ్స్



    Good News: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్



    Flipkart Year End Sale 2019: భారీ ఆఫర్లతో 'ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019'... డిస్కౌంట్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Election Commission of India, Telangana, Telangana Assembly, Telangana CEO, Telangana News, Vote, Voter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు