నేడే పదో తరగతి ఫలితాలు.. ఉదయం 11.30కి విడుదల

మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

news18-telugu
Updated: May 13, 2019, 6:48 AM IST
నేడే పదో తరగతి ఫలితాలు.. ఉదయం 11.30కి విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ వెల్లడించారు. ఫలితాల కోసం www.bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లు చూడవచ్చు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఇంటర్‌ ఫలితాల గందరగోళం నేపథ్యంలో పదో తరగతి ఫలితాలపై అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి మార్కులను ఒకటికి రెండుసార్లు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఫలితాల వెల్లడి సమయంలో హెడ్‌మాస్టర్లు పాఠశాలల్లోనే ఉండాలని డైరెక్టర్‌ సుధాకర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫలితాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ts ssc results, ts ssc results 2019, ts ssc results 2019,ts ssc results,ts 10th class results 2019,ts ssc result 2019,ts ssc results 2019 date,telangana ssc results 2019,ts 10th results 2019,ts 10th class exam results 2019,ts ssc 2019 results,ts 10th results date 2019,ts 10th results 2019 date,10th class results 2019,when is ts ssc results 2019,ssc results 2019,ssc results,ts 10th results latest news, 10th ssc result 2019 date telangana, ts ssc results 2019 date, telangana 10th results, Telangana State Board of Secondary Education, TS SSC Results date, TSBSE, telangana ssc results date, ssc results 2019 telangana, పదో తరగతి ఫలితాలు ఎప్పుడు, పదో తరగతి ఫలితాల డేట్, పదో తరగతి ఫలితాల తేదీ, తెలంగాణ పదోతరగతి ఫలితాల విడుదల, తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ టెన్త్ రిజల్ట్స్, టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు, టెన్త్ రిజల్ట్స్ తేదీ
ఫలితాల విడుదలపై ప్రకటన


ఇక, ఫలితాలను పాఠశాలల వారీగా పంపించనున్నారు. అంటే ఒక పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల ఫలితాలను ఒకేసారి పొందేలా ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లకు అవకాశం కల్పించారు. కాగా, ఫలితాల్లో ఏవైనా తప్పులు, సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకుగానూ ప్రత్యేకంగా TSSSCBOARD యాప్‌ను రూపొందించారు. యాప్‌ను ప్లేస్టోర్‌ లేదా www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించి సమాచారం అందిస్తారు. ఈ యాప్‌ ద్వారా ఒక్కో విద్యార్థి ఒక్కసారి మాత్రమే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.

First published: May 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు