news18-telugu
Updated: August 16, 2020, 1:37 PM IST
Rain Alert : వర్షంలో టెన్షన్... వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు...
తెలంగాణలో ఓ ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో చిక్కుకోవడంతో... ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపోకు చెందిన RTC బస్సు ఉదయం వయా లింగాల తెలకపల్లి, కల్వకుర్తి మీదుగా హైదరాబాద్ బయలుదేరింది. అప్పటికే డ్రైవర్‌కి డౌటు గానే ఉంది. ముసురు వర్షం, దానికి తోడు రోడ్లపై ఎక్కడ బడితే అక్కడ వాన ఉంది. అయినప్పటికీ డ్యూటీ ప్రకారం విధుల్లోకి దిగారు. రఘుపతి పేట దగ్గర ప్రవహిస్తున్న వాగు దగ్గరకు డ్రైవర్ వచ్చాక... బస్సును స్లో చేశారు. ఏమైంది అని ప్రయాణికులు అడిగారు. రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తోంది అని చెప్పారు. మరి బస్సు వెళ్లడం కుదరదా అని ప్రయాణికులు అడిగితే... ట్రై చెయ్యొచ్చు. గట్టిగా ప్రయత్నిస్తే వెళ్లిపోతుంది అంటూ... ముందుకుసాగారు. కానీ... ఆ రోడ్డుపై గుంతలున్నాయి. అందువల్ల బస్సు టైర్లు ఆ గుంతల్లో చిక్కుకున్నాయి. దాంతో బస్సు ముందుకు వెళ్లలేదు. దాంతో ప్రయాణికులు వామ్మో... అని టెన్షన్ పడ్డారు. వెంటనే ప్రయాణికులు జాగ్రత్తగా కిందకు దిగిపోయారు. అంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వాగు మధ్యలో ఉండిపోయింది. వర్షాన్ని తక్కువ అంచనా వేయకూడదని ఈ ఘటనే చెబుతోంది.
తెలంగాణలో ఈ రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఆల్రెడీ నాలుగు రోజులుగా ముసురు వానలు పడుతూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఆగస్ట్ 19న కొత్త అల్పపీడనం ఏర్పడవచ్చంటున్నారు. అందువల్ల వానలే వానలు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం అలర్టైంది. సీఎం కేసీఆర్... సమీక్ష జరిపి... అంతా రెడీగా ఉండాలన్నారు. మంత్రులు, అధికారులూ జిల్లాల్లోనే ఉండి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆల్రెడీ NDRF బృందాలు రంగంలోకి దిగాయి. వరద బాధితుల కోసం 040-23450624 అనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూంలు 24 గంటలూ పనిచేయనున్నాయి.
Published by:
Krishna Kumar N
First published:
August 16, 2020, 1:37 PM IST