Home /News /trending /

వీటిలో కామన్ ఏంటి? MicroSoft Google Adobe IBM ఇప్పుడు Twitter -parag agarwalపై మంత్రి ktr

వీటిలో కామన్ ఏంటి? MicroSoft Google Adobe IBM ఇప్పుడు Twitter -parag agarwalపై మంత్రి ktr

ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్, తెలంగాణ మంత్రి కేటీఆర్

ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్, తెలంగాణ మంత్రి కేటీఆర్

‘MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card, ఇప్పుడు Twitter.. వీటిలో కామ‌న్ ఏంటి? అంటూ ట్విటర్ కొత్త సీఈవోగా ఎంపికైన భారత సంతతి టెకీ పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ముంబై సిటీలోనే నవీ ముంబై పరిధిలోకి వచ్చే ఖర్గర్ ప్రాంతంలో పుట్టిపెరిగిన పరాగ్ అగర్వాల్.. ఐఐటీ బాంబే, స్టాన్‌‌ఫోర్డ్‌ విశ్వ‌వి‌ద్యా‌లయాల్లో చదువుకొని..

ఇంకా చదవండి ...
parag agarwal పరాగ్ అగర్వాల్.. ఇప్పుడీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్నది. సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు నూతన సీఈవోగా నియమితుడైన పరాగ్ కు ఎల్లడెలా అభినందనలు వెలువడుతున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థకు మరో భారతీయుడు నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో పరాగ్ ప్రతి ఇంట్లో చర్చనీయాంశమయ్యారు. ట్విటర్ సీఈవోగా జాక్ డోర్సే తప్పుకోవమే సంచలనం అనుకుంటే, మరింత సంచలనంగా పరాగ్ ఆ పదవికి ఎంపికయ్యారు. అన్ని రంగాల ప్రముఖులు ట్విటర్ కొత్త సీఈవోగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శైలిలో పరాగ్ ను విష్ చేశారు. దిగ్గజ సంస్థలను పేర్కొంటూ వాటిలో కామన్ ఏంటి? అంటూ కేటీఆర్ ఆసక్తికర కామెంట్ రాశారు..

గతంలో మైక్రో‌సాఫ్ట్‌.. కొతకాలానికే గూగుల్‌.. ఆ మద్య అడోబ్, ఐబీఎం, మైక్రాన్, మాస్టర్ కార్డ్, ఇప్పుడు ట్విటర్.. ఇలా గ్లోబల్‌ టెక్నా‌లజీ దిగ్గ‌జాలు వరు‌సగా భార‌తీ‌యుల సార‌థ్యం‌లోకి వస్తు‌న్నాయి. ట్విట్టర్‌ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్‌ కొత్త సీఈ‌వోగా పరాగ్‌ అగ‌ర్వాల్‌ నియ‌మి‌తు‌ల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ కొత్త సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ట్వీట్ చేశారాయన.

800 year old mummy : సంచలన చరిత్రను వెలికితీశారు -పెరూలో తక్కువ వయసున్న మమ్మీ -ఈజిప్ట్ వెలుపల తొలిసారి


‘MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card, ఇప్పుడు Twitter.. వీటిలో కామ‌న్ ఏంటి? ఈ అంత‌ర్జాతీయ కంపెనీల‌న్నింటికి ఇండియాలో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ట్విటర్ నూతన సీఈవోగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలు’అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఈ‌వోగా ట్విట్టర్‌ సహ వ్యవ‌స్థా‌ప‌కుడు జాక్‌ డోర్సే సోమ‌వారం దిగి‌పో‌వ‌డంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్ని‌కల్‌ ఆఫీ‌స‌ర్‌గా పని‌చే‌స్తున్న పరాగ్‌ అగ‌ర్వా‌ల్‌ను సంస్థ బోర్డు ఏక‌గ్రీ‌వంగా ఎన్నుకుంది.

Godavarikhani: భార్య అక్రమ సంబంధమే అసలు కారణం -యూట్యూబ్‌లో నాపేరు శివ సినిమా చూస్తూ శంకర్‌ను ముక్కలు చేశాడు..ట్విటర సహ వ్యవస్థాపకుడిగా జాక్ డోర్సే గడిచిన 16ఏళ్లుగా సంస్థకు సీఈవోగా పనిచేశాడు. పదవి నుంచి తప్పుకున్న డోర్సే.. 2022లో జరిగే సంస్థ వాటా‌దా‌రుల సమా‌వేశం వరకు డోర్సే ట్విటర్ బోర్డులో సభ్యు‌డిగా కొన‌సా‌గ‌ను‌న్నారు. ‘సహ వ్యవ‌స్థా‌ప‌కు‌డిగా ట్విటర్ తో మొద‌లైన నా ప్రయాణం సు‌మారు 16 ఏండ్లుగా కొన‌సా‌గింది. ఇప్పు‌డిక సంస్థను వీడా‌లని నిర్ణ‌యిం‌చు‌కున్నా. పరా‌గ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అతని నైపుణ్యం, ప్రతిభ సంస్థను మరింత ఎత్తుకు తీసు‌కె‌ళ్ల‌గ‌లవు. ఐ లవ్‌ ట్విటర్’ అంటూ జాక్ డోర్సే వీడ్కోలు ట్వీట్ చేశారు.

Karimnagar mlc : కమలంలో ముసలం -బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ -బీజేపీలోకి సర్దార్ రవీందర్ సింగ్!ముంబై సిటీలోనే నవీ ముంబై పరిధిలోకి వచ్చే ఖర్గర్ ప్రాంతంలో పుట్టిపెరిగిన పరాగ్ అగర్వాల్.. ఐఐటీ బాంబే, స్టాన్‌‌ఫోర్డ్‌ విశ్వ‌వి‌ద్యా‌లయాల్లో చదువుకున్నారు. పదేళ్ల కిందట ట్విటర్ లో యాడ్స్‌ ఇంజి‌నీ‌ర్‌గా చేరారు. అంచె‌లం‌చె‌లుగా ఎదు‌గుతూ 2017లో సంస్థ టెక్నా‌లజీ అధి‌ప‌తిగా పదో‌న్నతి పొందారు. ఇప్పుడు సీఈ‌వోగా ఎన్ని‌క‌య్యారు. గతంలో మైక్రో‌సాఫ్ట్‌, యాహూ తది‌తర సంస్థ‌ల్లోనూ పరాగ్ పని‌చే‌శారు. ‘ఈ బాధ్యత నాకు రావ‌డం‌పట్ల గర్వ‌ప‌డు‌తు‌న్నాను. డోర్సే మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని కొన‌సా‌గి‌స్తాను. ఆయన స్నేహా‌నికి కృత‌జ్ఞ‌తలు’ అని ఈ సంద‌ర్భంగా పరాగ్‌ అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: KTR, Minister ktr, Telangana, Twitter

తదుపరి వార్తలు