HOME »NEWS »TRENDING »telangana minister ktr shares an interesting video that went viral video ms

KT Ramarao: వావ్.. ఈ బుడ్డోడి టాలెంట్ చూసి కేటీఆర్ ఫిదా.. ఒలింపిక్స్ పంపిస్తే మెడల్ ఖాయం

KT Ramarao: వావ్.. ఈ బుడ్డోడి టాలెంట్ చూసి కేటీఆర్ ఫిదా.. ఒలింపిక్స్ పంపిస్తే మెడల్ ఖాయం
Image Credits Twitter

KT Ramarao: ఫీట్స్ అంటే అల్లా టప్పా కాదు.. పరిగెత్తుకుంటూ వచ్చి ఉన్నఫళంగా గాల్లో పల్టీలు కొట్టాడు. అతడి తీరు చూస్తుంటే ఈ బుడ్డోడు భవిష్యత్ లో ఒలంపిక్స్ లో మెడల్ సాధంచడం ఖాయం నెటిజన్లు అని కీర్తిస్తున్నారు.

  • News18
  • Last Updated: January 24, 2021, 18:28 IST
  • Share this:
    KT Ramarao: ఓ బుడ్డోడు కళ్లు మిరుమిట్లు గొలిపే విన్యాసాలు చేశాడు. వాటిని చూసినవాళ్లంతా ఔరా అంటున్నారు. ఒలంపిక్స్ లో కాకలు తీరిన యోధులు కూడా వేయని ఫీట్స్ ను ఒక బుడతడు చేశాడు. ఆ ఫీట్స్ ను చూసినవాళ్లంతా నోరెళ్లబట్టడం ఖాయం. ఫీట్స్ అంటే అల్లా టప్పా కాదు.. పరిగెత్తుకుంటూ వచ్చి ఉన్నఫళంగా గాల్లో పల్టీలు కొట్టాడు. అతడి తీరు చూస్తుంటే ఈ బుడ్డోడు భవిష్యత్ లో ఒలంపిక్స్ లో మెడల్ సాధంచడం ఖాయం అని కీర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిని ట్వీట్ చేశారు.

    ఈ వీడియోను ట్విట్టర్ లో తెలంగాణ ఐటీ, మున్సిపాల్టీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ బుడ్డోడి ప్రతిభను ఆయన ప్రశంసించారు. కేటీఆర్ కు ఈ వీడియోను పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేయగా... ఆ పోస్టును కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.







    ఈ ట్వీట్ ను కేటీఆర్ షేర్ చేస్తూ... ‘వావ్.. భవిష్యత్ ఒలంపిక్ తయారవుతున్నాడు. ఆ బుడ్డోడు హైదరాబాద్ కు తయారవుతున్నాడు. ఆ బుడ్డోడు హైదరాబాద్ కు చెందినోడా లేక భారతదేశానికి చెందినవాడా..?’ అని ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రతిభను కనబరిచిన ఆ చిన్నోడు ఎవరని ఆరా తీశారు. అతడెవరో తెలిస్తే అతడి ప్రతిభను మరింత మెరుగుపర్చేందుకు సాయం చేస్తానని తెలిపారు. ఆ బుడ్డోడి విన్యాసాలు మీరు కూడా చూసేయండి మరి..
    Published by:Srinivas Munigala
    First published:January 24, 2021, 18:25 IST