ఆంధ్రా చెల్లెలికి ఆపద.. అభయమిచ్చిన కేటీఆర్ అన్న..

మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తన బాధను వెల్లబోసుకుంది. రెండ్రోజులుగా తనకు ఏమీ తోచడం లేదని, తినడానికి తిండి లేదని, దయచేసి సొంతూరుకు వెళ్లడానికి సాయం చేయాలని కోరింది.

news18-telugu
Updated: March 25, 2020, 1:03 PM IST
ఆంధ్రా చెల్లెలికి ఆపద.. అభయమిచ్చిన కేటీఆర్ అన్న..
మంత్రి కేటీఆర్ ఫైల్ ఫోటో
  • Share this:
ఆ యువతి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందినది. పొట్ట కూటి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. జాబ్‌ కోసం చాలా కంపెనీలు తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఇంటికే వెళ్లిపోదామనుకుంది. ఇంతలో.. కరోనా ప్రభావంతో హైదరాబాద్ లాక్‌డౌన్ అయ్యింది. బస్సులు బంద్ అయ్యాయి. ఆటోలు, క్యాబ్‌లు, ఇతర రవాణా సర్వీసులన్నీ ఆగిపోయాయి. ఎటూ వెళ్లలేని పరిస్థితి. సరిగ్గా అప్పుడే చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. తినడానికి తిండి లేదు. ఉండటానికి వసతి లేదు.. ఏం చేయాలో తోచలేదు ఆ యువతికి. నిస్సహాయురాలైన ఆ యువతి.. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తన బాధను వెల్లబోసుకుంది. రెండ్రోజులుగా తనకు ఏమీ తోచడం లేదని, తినడానికి తిండి లేదని, దయచేసి సొంతూరుకు వెళ్లడానికి సాయం చేయాలని కోరింది.

ఆ ట్వీట్ మంత్రి చెంతకు చేరడంతో ఆయనే స్వయంగా స్పందించారు. ‘చెల్లెమ్మా! ఆందోళన చెందకు. మా బృందం నీకు సహాయం అందిస్తుంది’ అని అభయం ఇచ్చారు. ఆ ట్వీట్ ఆ యువతితో పాటు చాలా మందిని కదిలించింది. తాము కూడా సాయం అందిస్తామంటూ ముందకు వస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ఆమె వివరాలు సేకరిస్తున్నారు. చాలా సందర్భాల్లో సాయం అందించిన మంత్రి కేటీఆర్ వ్యక్తిత్వాన్ని మరోసారి వేనోళ్ల పొగుడుతున్నారు నెటిజన్లు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading