దగ్గర పడుతున్న గడువు...మొరాయిస్తున్న ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్

దగ్గర పడుతున్న గడువు...మొరాయిస్తున్న ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్

ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన (File)

వెబ్‌సైట్‌లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఆప్షన్లు ఏర్పాటు చేసినా వాటిని క్లిక్ చేస్తే ఎలాంటి స్పందన లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

 • Share this:
  ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తూ అధికారుల తీరును నిరసిస్తున్నారు. తప్పు జరిగిందని ఒప్పుకున్న బోర్డు.. దిద్దుబాటు చర్యలు చేపడతామని పేర్కొంది. ఫలితాల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దరఖాస్తు గడువును ఈ నెల 27 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, దరఖాస్తు, ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వెబ్‌సైట్‌లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఆప్షన్లు ఏర్పాటు చేసినా వాటిని క్లిక్ చేస్తే ఎలాంటి స్పందన లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఫలితాల అవకతవకలపై అసహనం వ్యక్తం కాగా, వెబ్‌సైట్‌ సరిగా పనిచేయకపోవడంతో అధికారుల తీరుపై విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
  telangana,inter board,bie,reverification,revaluation,recounting,website,students,parents,
  పనిచేయని ఇంటర్ బోర్డు వెబ్‌సైట్
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు